Home /News /sports /

LIONEL MESSI HEADING TO 2022 QATAR WORLD CUP AFTER DRAW JNK

FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్ 2022కు అర్హత సాధించిన అర్జెంటీనా.. బ్రెజిల్‌తో మ్యాచ్ డ్రా

ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన అర్జెంటీనా

ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన అర్జెంటీనా

FIFA World Cup 2022: లియోనల్ మెస్సీ కెప్టెన్సీలోఅర్జెంటీనా జట్టు ఫిఫా వరల్డ్ కప్ 2022కు అర్హత సాధించింది. బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకొని దక్షిణ అమెరికా గ్రూప్ 10 నుంచి అర్జెంటీనీ ఖతర్‌లో జరుగనున్న వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది.

ఇంకా చదవండి ...
    ఫిఫా వరల్డ్ కప్ 2022కు (FIFA World Cup 2022) లియోనల్ మెస్సీ (Leonel Messi) నేతృత్వంలోని అర్జెంటీనా (Argentina) జట్టు అర్హత సాధించింది. మంగళవారం రాత్రి సాన్ జువాన్‌లో దక్షిణ అమెరికా గ్రూప్ 10 భాగంగా బ్రెజిల్‌తో (Brazil) జరిగిన మ్యాచ్‌ను అర్జెంటీనా డ్రా చేసుకున్నది. గత కొంత కాలంగా గాయం కారణంతో మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్న కెప్టెన్ మెస్సీ.. బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర్తి 90 నిమిషాలు మైదానంలోనే చురుకుగా కదిలాడు. పలు మార్లు గోల్ చేయడానికి ప్రయత్నించినా మెస్సీ విఫలం అయ్యాడు. ఆఖరి నిమిషంలో మెస్సీ గోల్ పోస్టుపై నేరుగా కొట్టగా బ్రెజిల్ గోల్ కీపర్ అలిసన్ అడ్డుకున్నాడు. మరోవైపు బ్రెజిల్ స్టార్ ఆటగాడు నెయ్‌మార్ (Neymar)  ఈ మ్యాచ్‌లో ఆడలేదు. అయినా సరే బ్రెజిల్ ప్లేయర్లు చక్కగా డిఫెండ్ చేసుకొని అర్జెంటీనా అసలు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. దీంతో మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. బ్రెజిల్ ఇప్పటికే దక్షిణ అమెరికా 10 గ్రూప్ నుంచి వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది.

    దక్షిణ అమెరికా - 10 గ్రూప్ నుంచి ఒక్కొక్క జట్టు క్వాలిఫయర్స్‌లో 14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. టాప్ 4 స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో బ్రెజిల్ 13 మ్యాచ్‌లకు గాను 11 విజయాలు, 2 డ్రాలతో 35 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉన్నది. ఇక అర్జెంటీనా 13 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించి 5 మ్యాచ్‌లు డ్రా చేసుకున్నది. అర్జంటీనా ఖాతాలో 29 పాయింట్లు ఉన్నాయి. ఇక ఈక్వెడార్ 14 మ్యాచ్‌లలో 7 విజయాలు, 5 ఓటములు, 2 డ్రాలతో 23 పాయింట్లు సాధించి 3వ స్థానంలో ఉన్నది. కొలంబియా 14 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు 8 డ్రాలు 3 ఓటములతో 17 పాయింట్లు సాధించింది. పెరూ 14 మ్యాచ్‌లలో 5 విజయాలు 2 డ్రాలు 7 ఓటములతో 17 పాయింట్లు సాధించింది. కొలంబియా, పెరూ జట్లు పాయింట్ల పరంగా సమానంగానే ఉన్నా.. ఎక్కువ గోల్స్ చేసిన కొలంబియా నాలుగో స్థానంలో నిలిచింది. ఐదో స్థానంలో ఉన్న పెరూ జట్టు ఇంటర్ కాంటినెంటల్ ప్లేఆఫ్‌లో విజయం సాధించి క్వాలిఫై కావల్సి ఉన్నది.

    BCCI: బీసీసీఐకి కలిసొచ్చిన లక్.. రూ. 1500 కోట్ల నష్టాన్ని పూడ్చనున్న ఐసీసీ... ఎందుకో తెలుసా?







    వచ్చే ఏడాది నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 వరకు ఖతర్ లోని ఐదు నగరాల్లో ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీ జరుగనున్నది. ఈ టోర్నీలో మొత్తం 32 దేశాలు పాల్గొంటాయి. ఖతర్ ఆతిథ్య దేశంగా ఆటోమెటిక్‌గా అర్హత సాధించగా... మిగిలిన జట్లు ఆయా ఖండాలకు సంబంధించిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల ద్వారా ప్రపంచ కప్ బెర్తును కన్ఫార్మ్ చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు 13 దేశాలు ప్రపంచ కప్‌కు క్వాలిఫై అయ్యాయి.

    ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన జట్లు: ఖతర్,జర్మనీ, డెన్మార్క్, బ్రెజిల్, ఫ్రాన్స్, బెల్జియం, క్రొయేషియా, స్పెయిన్, సెర్బియా, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, అర్జెంటీనా.
    Published by:John Kora
    First published:

    Tags: FIFA, Football, World cup

    తదుపరి వార్తలు