Home /News /sports /

LEGENDS LEAGUE CRICKET 2022 SOURAV GANGULY TO LEAD INDIA MAHARAJAS AGAINST WORLD GAINTS IN AZADI KA AMRIT MAHOTSAV SPECIAL MATCH SJN

LLC 2022: గ్రౌండ్ లో మళ్లీ గర్జించేందుకు సిద్ధమైన దాదా.. వరల్డ్ జెయింట్స్ తో భారత్ మహరాజాస్ పోరు.. ఎప్పుడంటే?

PC : TWITTER

PC : TWITTER

LLC 2022: గతేడాది జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (Legends league cricket) టి20 టోర్నీ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. మాజీ క్రికెటర్లు మరోసారి తలపడటంతో ఆ మ్యాచ్ లను చూసేందుకు అభిమానులు పోటెత్తిన సంగతి తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
LLC 2022: గతేడాది జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (Legends league cricket) టి20 టోర్నీ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. మాజీ క్రికెటర్లు మరోసారి తలపడటంతో ఆ మ్యాచ్ లను చూసేందుకు అభిమానులు పోటెత్తిన సంగతి తెలిసిందే. ఇక మరోసారి ఈ టోర్నీ అలరించేందుకు సిద్ధమైంది. లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో సీజన్ సెప్టెంబర్ నెలలో ఒమన్ వేదికగా జరగనుంది. అయితే అంతకంటే ముందే భారత్ మహరాజాస్ (India Maharajas), వరల్డ్ జెయింట్స్ (World gaints) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ (భారత్‌ 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమం)లో భాగంగా ఇండియా మహరాజాస్‌, వరల్డ్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ నిర్వహణకు రంగం సిద్ధమైంది. కోల్‌కతాలోని విఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌లో సెప్టెంబరు 16న జరిగే ఈ మ్యాచ్‌లో సుమారు 10 దేశాలకు చెందిన ఆటగాళ్లు భాగం కానున్నారు.

ఇది కూడా చదవండి  : పైన పటారం.. లోన లొటారం అంటే ఇదే కాబోలు.. ఆదర్శంగా కనిపించే కివీస్ జట్టులో చీకటి కోణమా.?

మరోసారి భారత కెప్టెన్ గా దాదా

ఇందులో బరిలోకి దిగే భారత్ మహరాజాస్ జట్టుకు కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ () వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ కోసం గంగూలీ ఇప్పటికే కసరత్తులను కూడా ఆరంభించాడు. ఈ ఫండ్‌ రైజింగ్‌ మ్యాచ్‌లో  వరల్డ్‌ జెయింట్స్‌కు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యం వహించనున్నాడు. గంగూలీ టీంలో వీరేంద్ర సెహ్వాగ్‌, మహ్మద్‌ కైఫ్‌, యూసఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ సహా మొత్తం 17 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇక వరల్డ్‌ జెయింట్స్‌లో వెస్టిండీస్‌ దిగ్గజం లెండిల్‌ సిమన్స్‌, ప్రొటిస్‌ మాజీ ప్లేయర్‌ హర్షల్‌ గిబ్స్‌, శ్రీలంక లెజెండ్‌ సనత్‌ జయసూర్య వంటి 17 మంది మాజీ క్రికెటర్లకు చోటు దక్కింది.



ఇండియా మహరాజాస్‌ జట్టు:
సౌరవ్‌ గంగూలీ(కెప్టెన్‌), వీరేంద్ర సెహ్వాగ్‌, మహ్మద్‌ కైఫ్‌,యూసఫ్‌ పఠాన్‌, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, పార్థివ్‌ పటేల్‌(వికెట్‌ కీపర్‌), స్టువర్ట్‌ బిన్నీ, ఎస్‌ శ్రీశాంత్‌, హర్భజన్‌ సింగ్‌, నమన్‌ ఓజా(వికెట్‌ కీపర్‌), అక్షశ్‌ దిండా, ప్రజ్ఞాన్‌ ఓజా, అజయ్‌ జడేజా, ఆర్పీ సింగ్‌, జోగీందర్‌ శర్మ, రితేందర్‌ సింగ్‌ సోధి.


వరల్డ్‌ జెయింట్స్‌ జట్టు:
ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), లెండిల్‌ సిమన్స్‌, హర్షల్‌ గిబ్స్‌, జాక్వస్‌ కలిస్‌, సనత్‌ జయసూర్య, మాట్‌ ప్రియర్‌(వికెట్‌ కీపర్‌), నాథన్‌ మెకల్లమ్‌, జాంటీ రోడ్స్‌, ముత్తయ్య మురళీధరన్‌, డేల్‌ స్టెయిన్‌, హోమిల్టన్‌ మసకజ్ద, మష్రాఫ్‌ మోర్తజా, అస్గర్‌ అఫ్గన్‌, మిచెల్‌ జాన్సన్‌, బ్రెట్‌ లీ, కెవిన్‌ ఒ బ్రెయిన్‌, దినేశ్‌ రామ్‌దిన్‌(వికెట్‌ కీపర్‌).

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Azadi Ka Amrit Mahotsav, Harbhajan singh, Sehwag, Sourav Ganguly, Team India, Virender Sehwag

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు