Rishabh Pant : పంత్‌కు కపిల్ సలహాలు.. కాస్త తగ్గించుకుంటే మంచిందంటున్న దిగ్గజ క్రికెటర్

రిషబ్ పంత్‌కు కపిల్ దేవ్ ఇచ్చిన సలహాలు ఏమిటంటే..! (PC: BCCI)

భారత జట్టు త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నది. ఈ మధ్య జట్టులో కీలకంగా మారిన రిషబ్ పంత్‌కు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ కొన్ని విలువైన సలహాలు ఇచ్చాడు. అవేంటంటే..

  • Share this:
    టీమ్ ఇండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మాన్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనతో ప్రారంభమైన పంత్ హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ విజయం, ఇంగ్లాండ్‌‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2021లో (IPL 2021) శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి విజయవంతమయ్యాడు. పంత్ ఈ సీజన్‌లో ఏ బాధ్యత చేపట్టినా పరిణితితో నెరవేరుస్తున్నాడు. గతంలో కంటే పంత్ ఆటతీరులో చాలా మార్పు కనిపిస్తున్నది. అయితే రిషబ్ పంత్‌లో ఇంకా కొన్ని లోపాలు కనిపిస్తున్నట్లు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ (Kapil Dev) వ్యాఖ్యానించారు. త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్న నేపథ్యంలో పంత్‌కు కొన్ని విలువైన సలహాలు (Suggestions) ఇచ్చాడు. ప్రతీ బంతిని కొట్టడానికి ప్రయత్నించవద్దని.. సాధ్యమైనంత ఎక్కువ సమయం క్రీజులో గడపడానికి ప్రయత్నించాలని కపిల్ అన్నాడు. 'పంత్ బ్యాటింగ్‌లో చాలా మార్పు కనిపిస్తున్నది. అతడు మంచిగా పరిణితి చెందాడు. పంత్ ఎక్కువగా హిట్టింగ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అతడు కచ్చితంగా మంచి హిట్టరే. కానీ అన్ని పిచ్‌లపై అలా ఆడటానికి కుదరదు. ఇంగ్లాండ్‌లో పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. అందుకే క్రీజులో ఎక్కువ సమయం గడిపితే ప్రత్యర్థి బౌలర్లకు కూడా ఇబ్డందికరంగా మారుతుంది. అప్పుడు నెమ్మదిగా హిట్టింగ్ ప్రారంభించవచ్చు' అని కపిల్ ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

    గతంలో రోహిత్ శర్మ కూడా క్రీజులోకి రావడంతోనే హిట్టింగ్ మొదలు పెట్టేవాడు. ప్రతీ బంతినిక బలంగా బాదాలని అనుకునేవాడు. అలాంటి సందర్భంలో అనవసరంగా వికెట్ పారేసుకొని ప్రత్యర్థి జట్టు పై చేయి సాధించేలా అవకాశాలు ఇచ్చావాడు. చాలా సార్లు క్రీజ్ వదలి బయటకు వచ్చి ఆడేవాడు. అప్పుడు కూడా నేను ఇదే సలహా ఇచ్చాను. సాధ్యమైనంతగా క్రీజులో పాతుకొని పోవాలని చెప్పాను. ఆ లోపాన్ని రోహిత్ శర్మ సరిదిద్దు కున్నాడని కపిల్ చెప్పుకొచ్చాడు. రిషబ్ పంత్ కూడా తన సలహా పాటిస్తే మరిన్ని ఎక్కువ పరుగులు చేసే అవకాశం ఉంటుందని కపిల్ అంటున్నాడు.

    Ravi Shastri : రవిశాస్త్రి ఒక ఆడి కార్.. దీని వెనుక స్టోరీ తెలుసా? మ్యాచ్ జరుగుతుండగా కార్ గురించి మియాందాద్‌తో వాగ్వాదం

    ఇక భారత్, న్యూజీలాండ్ జట్లు జూన్ 18 నుంచి 22 వరకు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. కాగా, ఈ ఫైనల్‌లో ఒకే టెస్టు ఆడటంపై కపిల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఫైనల్‌ను బెస్టాఫ్ 3గా ఆడిస్తే అప్పుడు మంచి ఫలితం ఉంటుందని అన్నాడు. ఇప్పుడిప్పుడే టెస్ట్ మ్యాచ్’లకు తిరిగి ఆదరణ పెరుగుుతున్నది. ఇలాంటి సమయంలో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను బెస్టాఫ్ 3గా ఆడిస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని కపిల్ వ్యాఖ్యానించారు.
    Published by:John Naveen Kora
    First published: