LEANDER PAES INDIAN TENNIS LEGEND LEANDER PAES GUILTY OF DOMESTIC VIOLENCE ON HER EX PARTNER RHEA PILLAI MUMBAI COURT GAVE VERDICT SJN
Leander paes: భారత్ కు ఒలింపిక్ మెడల్ అందించాడు... కట్ చేస్తే గృహ హింస కేసులో దోషిగా తేలాడు
లియాండర్ పేస్ (ఫైల్ ఫోటో)
Leander paes: 1996లో జరిగిన ఒలింపిక్స్ (olympics) క్రీడల్లో భారత్ ()కు కాంస్య పతకం అందించిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ (Leander paes)ను ముంబై (mumbai) కోర్టు దోషిగా తేల్చింది. ఎందుకు తేల్చిందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల కోసం చదవండి
Leander paes: లియాండర్ పేస్ (Leander paes) భారత (India) టెన్నిస్ (Tennis) ముఖ చిత్రాన్ని మార్చేసిన దిగ్గజ ప్లేయర్. 23 ఏళ్ల వయసులో 1996లో జరిగిన ఒలింపిక్స్ (Olympics)లో పురుషుల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో భారత్ కు కాంస్య పతకం అందించి ఇండియాను గర్వపడేలా చేశాడు. అనంతరం మరో టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి (Mahesh Bhupati)తో కలిసి టెన్నిస్ లో అనేక టైటిల్స్ ను సాధించి భారత ఖ్యాతిని మరింత ఇనుమడింప చేశాడు. అదంతా గతం తాజాగా అతడు కోర్టులో దోషిగా తేలాడు. తనను వేధించాడంటూ భార్య పెట్టిన కేసులో దోషిగా తేలాడు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తిగా చదవండి
లియాండర్ పేస్, రియా పిళ్లై (Rhea pillai) 2003 నుంచి 2014 మధ్య కలిసి ఉన్నారు. అయితే తనను వేధిస్తున్నాడంటూ 2014లో రియా పిళ్లై ముంబై (mumbai)లోని మెట్రోపాలిటన్ కోర్టులో లియాండర్ పేస్ పై గృహహింస కేసు పెట్టింది. దీనిని విచారించిన కోర్టు రియాను లియాండర్ పేస్ వేధించాడని... అతడు గృహహింస కేసులో దోషి అని తేలుస్తూ తీర్పు ఇచ్చింది. వీటితో పాటు మరికొన్ని అంశాలను తన తీర్పులో పేర్కొంది. మాజీ భాగస్వామి రియా పిళ్లై ఖర్చుల కోసం నెల నెలా రూ లక్ష రూపాయలను భరణంగా పేస్ చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. రియా, పేస్ ఇద్దరికీ సమాన హక్కు కలిగిన ఇంట్లో రియా ప్రస్తుతం ఉంటున్నారు. ఒక వేళ ఆమె ఆ ఇంటిని విడిచి వెళ్లాలనుకుంటే మాత్రం... అద్దె రూపంలో మరో రూ 50 వేలను లియాండర్ పేస్ రియాకు చెల్లించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. లియాండర్ పేస్, రియా పిళ్లైలకు ఒక కూతురు ఉంది.
లియాండర్ పేస్ తన టెన్నిస్ కెరీర్ లో అద్భుత విజయాలను సొంతం చేసుకున్నాడు. సింగిల్స్ లో పెద్దగా రాణించలేకపోయిన అతడు... డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ విభాగాల్లో సూపర్ సక్సెస్ అయ్యాడు. పురుషుల డబుల్స్ విభాగంలో 8 గ్రాండ్ స్లామ్ టోర్నీలను గెలుచుకున్నాడు. వీటిలో అత్యధికంగా ఫ్రెంచ్ ఓపెన్ (french open) ను మూడు సార్లు (1999, 2001, 2009), యూఎస్ ఓపెన్ (us opoen) ను కూడా మూడు సార్లు (2006, 2009, 2013), వింబుల్డన్ (1999), ఆస్ట్రేలియన్ ఓపెన్ (2012)లను ఒక్కోసారి గెలిచాడు. ఇక మిక్స్ డ్ డబుల్స్ విభాగాల్లో బరిలోకి దిగిన పేస్... అక్కడ కూడా ఔరా అనిపించాడు. 10 మిక్స్ డ్ డబుల్స్ టైటిల్స్ ను సొంతం చేసుకున్నాడు. వీటిల్లో వింబుల్డన్ ను అత్యధికంగా నాలుగు సార్లు సొంతం చేసుకోగా... ఆస్ట్రేలియన్ ఓపెన్ ను మూడు సార్లు, యూఎస్ ఓపెన్ ను రెండు సార్లు... ఫ్రెంచ్ ఓపెన్ ను ఒకసారి నెగ్గాడు. ఓవరాల్ గా తన కెరీర్ లో మొత్తంగా 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను నెగ్గాడు. అయితే తాజాగా కోర్టులో దోషిగా తేలి పరువును బజారున పడేలా చేసుకున్నాడు. పేస్ ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ కిమి శర్మ తో డేటింగ్ లో ఉన్నాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.