హోమ్ /వార్తలు /క్రీడలు /

Roger Federer : అభిమానులతో కంటతడి పెట్టించిన ఫెడరర్.. ఆఖరికి చిరకాల ప్రత్యర్థి కూడా ఏడ్చేశాడు..

Roger Federer : అభిమానులతో కంటతడి పెట్టించిన ఫెడరర్.. ఆఖరికి చిరకాల ప్రత్యర్థి కూడా ఏడ్చేశాడు..

PC : TWITTER

PC : TWITTER

Roger Federer : రెండు దశాబ్దాల పాటు తన ఆటతో టెన్నిస్ (Tennnis) అభిమానులను అలరించిన ఆ ప్లేయర్ రాకెట్ సెలవు తీసుకుంది. టెన్నిస్ లో గొప్ప ప్లేయర్స్ ఉన్నా.. తన ఆటతో గేమ్ కే అందం తెచ్చిన ప్రిన్స్ ఆటకు అల్విదా పలికాడు. మూడు తరాల టెన్నిస్ ప్లేయర్లతో పోటీ పడ్డ టెన్నిస్ సూపర్ స్టార్ రోజర్ ఫెడరర్ (Roger Federer) తన ఆఖరి ఆటను ఆడేశాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Roger Federer : రెండు దశాబ్దాల పాటు తన ఆటతో టెన్నిస్ (Tennnis) అభిమానులను అలరించిన ఆ ప్లేయర్ రాకెట్ సెలవు తీసుకుంది. టెన్నిస్ లో గొప్ప ప్లేయర్స్ ఉన్నా.. తన ఆటతో గేమ్ కే అందం తెచ్చిన ప్రిన్స్ ఆటకు అల్విదా పలికాడు. మూడు తరాల టెన్నిస్ ప్లేయర్లతో పోటీ పడ్డ టెన్నిస్ సూపర్ స్టార్ రోజర్ ఫెడరర్ (Roger Federer) తన ఆఖరి ఆటను ఆడేశాడు. రాడ్ లేవర్ (Rod Laver Cup) 2022 కప్ తనకు చివరిదంటూ గత వారం ప్రకటించిన రోజర్.. తన చిరకాల ప్రత్యర్థి, స్నేహితుడు రాఫెల్ నడాల్ (Rafael Nadal)తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ అనంతరం ఆటకు గుడ్ బై చెప్పాడు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించాడు. ఆఖరికి నడాల్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఫెడరర్ తో పాటు తను కూడా చిన్నిపిల్లాడిలా ఏడ్చాడు.

రాడ్ లేవర్ కప్ లో భాగంగా టీం యూరప్ కు ప్రాతినిధ్యం వహించిన నడాల్-ఫెడరర్ డబుల్స్ మ్యాచ్ లో 6-4, 6-7 (2/7), 9-11తో టీం వరల్డ్ కు చెందిన టియాఫే-జాక్ సాక్ జంట చేతిలో ఓడింది. ఇక మ్యాచ్ అనంతరం ఫెడరర్ ఎమోషన్ అయ్యాడు. వాస్తవానికి తన చివరి మ్యాచ్ అనంతరం కన్నీళ్లు పెట్టరాదనే ఉద్దేశంలో తాను ఉన్నట్లు ఫెడరర్ మ్యాచ్ కు ముందు తెలిపాడు. అయితే మ్యాచ్ అనంతరం అభిమానులతో పాటు ఫ్యామిలీని చూశాక కన్నీళ్లు పెట్టకుండా ఉండలేకపోయాడు. గాయాల కారణంగా కెరీర్ ను చాలా సార్లు ముగించాలని అనుకున్నా అని కానీ, తన భార్య మిర్కా అడ్డు చెబుతూ తనలో ఆత్మవిశ్వాసం నింపేదని ఫెడరర్ పేర్కొన్నాడు. ఇన నడాల్ కూడా ఏడ్చేశాడు. ఆటలో వీరిద్దరు ప్రత్యర్థులుగా పోటీ పడినప్పటికీ కోర్టు బయట వీరిద్దరు మంచి స్నేహితులు..

1998 ఏళ్ల వయసులో ప్రొఫెషినల్ టెన్నిస్ కెరీర్ ను ఆరంభించిన ఫెడరర్.. తొలి గ్రాండ్ స్లామ్ ను 21 ఏళ్ల వయసులో 2003లో గెలుచుకున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన వింబుల్డన్ కోటాలో తన జెండా ఎగరవేశాడు. ఇక అక్కడి నుంచి ఫెడరర్ కెరీర్ దూసుకువెళ్లింది. అప్పటి వరకు నంబర్ వన్ గా ఉన్న పీట్ సంప్రాస్ ను వెనక్కి నెట్టి నయా నంబర్ వన్ గా అవతరించాడు. చూస్తుండగానే 14వ గ్రాండ్ స్లామ్ ను సాధించి.. పీట్ సంప్రాస్ అత్యధిక టైటిల్స్ రికార్డును సమం చేశాడు. కొంత విరామం తర్వాత 15వ టైటిల్ నెగ్గి పురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ నెగ్గిన ప్లేయర్ గా అవతరించాడు. అంతేకాకుండా 2018 వింబుల్డన్ ను నెగ్గి 20వ టైటిల్ నెగ్గిన తొలి పురుషు ప్లేయర్ గా నిలిచాడు. ప్రస్తుతం పురుషుల విభాగంలో నాదల్ 22 టైటిల్స్ తో తొలి స్థానంలో ఉండగా.. నొవాక్ జొకోవిచ్ 21 టైటిల్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు. ఫెడరర్ మూడో స్థానంలో ఉన్నాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: French open, Novak Djokovic, Rafael Nadal, Roger Federer, Serena Williams, Tennis, Us open, Wimbledon

ఉత్తమ కథలు