4 బంతుల్లో 4 వికెట్లు... మలింగ ప్రపంచ రికార్డ్

మూడో బంతికి మన్రోను ఔట్ చేసిన మలింగ.. నాలుగో బంతికి రూథర్‌ఫర్డ్, ఐదో బాల్‌కి గ్రాండ్ హోమ్, ఆరో బంతికి టేలర్‌ను ఔట్ చేశాడు.

news18-telugu
Updated: September 6, 2019, 11:53 PM IST
4 బంతుల్లో 4 వికెట్లు... మలింగ ప్రపంచ రికార్డ్
లసిత్ మలింగ
news18-telugu
Updated: September 6, 2019, 11:53 PM IST
శ్రీలంక సీనియర్ బౌలర్ లసిత్ మలింగ మరోసారి అదరగొట్టాడు. న్యూజిలాండ్‌తో పల్లెకెలెలో జరిగిన మూడో టీ20లో చెలరేగిపోయాడు. బుల్లెట్‌లాంటి బంతులు విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి సత్తాచాటాడు. వరస బంతుల్లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కోలిన్ మన్రో (12), హమీష్ రూథర్‌ఫర్డ్ (0), కోలిన్ డి గ్రాండ్‌హో‌మ్ (0), రాస్ టేలర్ (0) ఓట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు సార్లు (ట్వీ20, వన్డే) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు మలింగ. గతంలో 2007 వన్డే వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా జట్టుపై నాలుగు వికెట్లు సాధించాడు.

అంతేకాదు టీ20ల్లో 100 వికెట్లు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (97 వికెట్లు) పేరుపై ఉన్న రికార్డును మలింగ బద్దలుగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్‌లో మొదల బ్యాటింగ్ చేసిన లంక జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 రన్స్ చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టును మలింగ దెబ్బకొట్టాడు. మూడో ఓవర్లోనే న్యూజిలాండ్ జట్టును కుప్పకూల్చాడు. మూడో బంతికి మన్రోను ఔట్ చేసిన మలింగ.. నాలుగో బంతికి రూథర్‌ఫర్డ్, ఐదో బాల్‌కి గ్రాండ్ హోమ్, ఆరో బంతికి టేలర్‌ను ఔట్ చేశాడు. దాంతో 16 ఓవర్లలో 88 పరుగులకే కవీస్ టీమ్ ఆలౌటయింది. 37 పరుగుల తేడాతో శ్రీలంక జట్టు విజయం సాధించింది.



First published: September 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...