మీ నగరాన్ని ఎంచుకోండి

  హోమ్ /వార్తలు /క్రీడలు /

  Virat Kohli : కింగ్ కోహ్లీకి లిప్ కిస్ ఇచ్చిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్.. పాపం, అనుష్క శర్మ!

  Virat Kohli : కింగ్ కోహ్లీకి లిప్ కిస్ ఇచ్చిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్.. పాపం, అనుష్క శర్మ!

  PC : Twitter

  PC : Twitter

  Virat Kohli : విరాట్‌ ఎక్కడికి వెళ్లినా అతడిని చూసేందుకు అభిమానులు ఎగబడతారు. విరాట్ కోహ్లీని టీవీల్లోనే చూసి ఉబ్బితబ్బిబైపోయే ఫ్యాన్స్.. అతను నేరుగా కలిసినా.. ఓ సెల్ఫీ దిగినా అదృష్టవంతులుగా ఫీలవుతుంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

  టీమిండియా (Team India) కెప్టెన్సీ వదులుకున్నా విరాట్ కోహ్లి (Virat Kohli) క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మైదానంలో అగ్రెసివ్ ఆటతో విరుచుకుపడే కోహ్లికి పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోహ్లీని ఇన్పిరేషన్ గా తీసుకునేవాళ్లు ఉంటారు. స్టేడియంలో ప్లకార్డులు పట్టుకొని తమ ప్రేమను తెలిపేవాళ్లూ ఉంటారు. విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా వేదికగా అతని ఫాలోవర్ల సంఖ్య చూస్తేనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. సాకర్ లెజెండ్స్ లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో తర్వాత అత్యంత పాపులారిటీ ఉన్న ప్లేయర్ విరాట్ కోహ్లీ. దాయాది దేశం పాకిస్తాన్ లో కోహ్లీ అంటే పడిచచ్చే అభిమానులు బోలెడంత మంది ఉన్నారు. ఇక, అమ్మాయిల్లో కూడా కోహ్లీకి విపరీతమైన క్రేజ్ ఉంది. పెళ్లి అయినా సరే కోహ్లీని ప్రేమించే యువతులు బోలెడు మంది.

  విరాట్‌ ఎక్కడికి వెళ్లినా అతడిని చూసేందుకు అభిమానులు ఎగబడతారు. విరాట్ కోహ్లీని టీవీల్లోనే చూసి ఉబ్బితబ్బిబైపోయే ఫ్యాన్స్.. అతను నేరుగా కలిసినా.. ఓ సెల్ఫీ దిగినా అదృష్టవంతులుగా ఫీలవుతుంటారు. అలాంటిది తాజాగా ఓ యువతి కోహ్లీకి లిప్ కిస్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. తనకు కోహ్లీనే కిస్ ఇస్తున్నట్లుగా ఓ పోస్ ఇవ్వగా.. ఆ యువతి స్నేహితురాలు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది.

  వైరలవుతున్న వీడియో ఇదే..!

  లిప్‌లాక్ ఇస్తూ ఆ అమ్మాయి ప్రదర్శించిన ఎక్స్ ప్రెషన్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. అయితే ఆ అమ్మాయి ఎవరో?, ఎక్కడ ఎప్పుడు జరిగిందో అనే విషయాలపై క్లారిటీ లేదు. ఈ ఫొటోస్, వీడియో చూసిన పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘భలే ఛాన్స్ కొట్టేసింది’ అని ఓ యూజర్‌ ట్వీట్‌ చేయగా.. ‘పాపం అనుష్క శర్మ’ మరో యూజర్‌ కామెంట్‌ చేశారు. మరో యూజర్‌ ఏం జరుగుతోంది? అని, ఇంకొకరు మైనపు బొమ్మను పాడు చేసిందని, ఎవరో ఆమె అంటూ మరో యూజర్‌ కామెంట్‌ పెట్టారు. అయితే, సదరు యువతి కోహ్లీ వీరాభిమాని అని తెలుస్తుండగా.. వివరాలు తెలియరాలేదు.

  ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లిమిటెడ్ ఫార్మాట్ వన్డేలు, టీ20ల్లో సెంచరీలు చేసి ఫాంలోకి వచ్చిన కోహ్లీ.. టెస్ట్ ఫార్మాట్ లో కూడా సెంచరీ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. 2-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ మూడు రోజుల్లోనే ముగియడంతో భారత ఆటగాళ్లకు 6 రోజుల బ్రేక్ ఇచ్చారు. దాంతో ఆటగాళ్లంతా ఫ్యామిలీతో గడుపుతున్నారు.

  First published:

  Tags: Anushka Sharma, Cricket, IND vs AUS, Viral Video, Virat kohli

  ఉత్తమ కథలు