వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో తన తప్పిదం కారణంగానే ఓవర్ త్రోకు ఇంగ్లండ్‌కు 6 పరుగులు ప్రకటించాల్సి వచ్చిందని ఎట్టకేలకు శ్రీలంక అంపైర్ కుమార ధర్మసేన తన తప్పును అంగీకరించాడు. అయితే ఆ నిర్ణయం పట్ల తనకు ఎలాంటి చింత లేదని అన్నాడు. దీంతో నెటిజన్లు భగ్గు మంటున్నారు. ధర్మసేన చివరి ఓవర్లో తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఇంగ్లాండ్ కు ఒక పరుగు అదనంగా రావడంతో మ్యాచ్ టైగా ముగిసి, న్యూజిలాండ్ విజయం అందుకోలేకపోయింది. ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్నసమయంలో 49వ ఓవర్ నాలుగో బంతికి రెండో పరుగు తీస్తున్నప్పుడు వికెట్ల వైపుకు దూసుకొస్తునర్న బెన్ స్టోక్స్ బ్యాట్‌ను ఫీల్డర్ విసిరిన బంతి తాకి ఓవర్‌త్రో బౌండరీకి తరలింది. దీంతో అంపైర్ ధర్మసేన ఇంగ్లండ్‌కు మొత్తం 6 రన్స్ ఇవ్వడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఆ బంతికి 5 రన్సే ప్రకటించాలని మాజీ అంపైర్లు అభిప్రాయపడ్డారు. అయితే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన వరల్డ్ కప్ ఫైనల్ ను ఇప్పుడు టీవీ రీప్లేలో చూస్తే తన నిర్ణయం తప్పే అని ధర్మసేన అన్నారు. అయితే ఆ నిర్ణయానికి చింతించడం లేదన్నారు. మరోవైపు తన నిర్ణయాన్ని ఐసీసీ కూడా అభ్యంతరం తెలపలేదని అని ధర్మసేన అన్నారు.