HOME »NEWS »SPORTS »kumar dharmasena marais erasmus named on field umpires for world cup 2019 final ba

ICC Cricket World Cup 2019: ఇంగ్లండ్ - న్యూజిలాండ్ వరల్డ్ కప్ ఫైనల్‌కు అంపైర్లు వీరే..

ICC Cricket World Cup 2019: ఇంగ్లండ్ - న్యూజిలాండ్ వరల్డ్ కప్ ఫైనల్‌కు అంపైర్లు వీరే..
ఫీల్డ్ అంపైర్లు కుమార ధర్మసేన, మారియస్ ఎరాస్మస్‌తో రాయ్ (Image:Reuters)

World Cup Final | ఈ టీమ్ మొత్తం ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో పనిచేసింది.

  • Share this:
    ఈ నెల 14 న లార్ట్స్ మైదానంలో ఇంగ్లండ్ - న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌కు అంపైర్లను ఐసీసీ ప్రకటించింది. శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన దక్షిణాఫ్రికాకు చెందిన మారియస్ ఎరాస్మస్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన రాడ్ టక్కర్ ధర్డ్ అంపైర్. పాకిస్తాన్‌కు చెందిన అలీమ్ ధర్ నాలుగో అంపైర్‌గా వ్యవహరిస్తారని ఐసీసీ ప్రకటించింది. శ్రీలంకకే చెందిన రంజన్ మదుగులే మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నాడు. ఆశ్చర్యకరంగా ఈ టీమ్ మొత్తం ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో పనిచేసింది. ఇంగ్లండ్ - ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా జాసన్ రాయ్ ఔట్ వివాదస్పదమైంది. 65 బంతుల్లో 85 పరుగులు చేసి మంచి జోరు మీదున్న రాయ్‌ 20 ఓవర్లో కమిన్స్ వేసిన ఓ బంతిని ఆడబోయాడు. అయితే, అది బ్యాట్‌కి గానీ, చేతికి గానీ తగలకపోయినా.. ఆస్ట్రేలియా బౌలర్లు పదే పదే అప్పీల్ చేయడంతో కుమార ధర్మసేన ఔట్ ఇచ్చేశాడు. అప్పటికే ఇంగ్లండ్ రివ్యూ వాడుకుని ఉండడంతో రాయ్.. అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో రాయ్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది ఐసీసీ. దీంతో పాటు అతడి ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లు కూడా జోడించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:July 12, 2019, 22:39 IST