Cricket: టీమిండియాలో ధోనీ రాక కోసం ఎదురుచూస్తున్నా...కుల్దీప్ యాదవ్

నేను ధోనీకి పెద్ద ఫ్యాన్‌ను. అతడు త్వరలోనే టీమ్‌లోకి తిరిగి రావాలని, జట్టుకు ఆడాలని కోరుకుంటున్నా అని కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు. ఇండియాకు ధోని ఆడాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. మేం ఎప్పుడు ఫీల్డ్‌లోకి అడుగుపెట్టినా మహీ మంచి సూచనలతో ముందుకొచ్చేవాడు. అలాంటి అడ్వయిజ్‌లు నా కెరీర్‌‌కు ఎంతో హెల్ప్‌ అయ్యాయి.

news18-telugu
Updated: June 30, 2020, 7:44 PM IST
Cricket: టీమిండియాలో ధోనీ రాక కోసం ఎదురుచూస్తున్నా...కుల్దీప్ యాదవ్
కులదీప్ యాదవ్
  • Share this:
ధోనీని తాను వ్యక్తిగతంగా చాలా మిస్ అవుతున్నానని మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. టీమిండియా తరపున ధోని మళ్ళి ఆడాలని కోరుకుంటున్నట్లు యాదవ్ తెలిపాడు. "మేం అందరం మహీ భాయ్‌ను మిస్సవుతున్నాం. నేను ధోనీకి పెద్ద ఫ్యాన్‌ను. అతడు త్వరలోనే టీమ్‌లోకి తిరిగి రావాలని, జట్టుకు ఆడాలని కోరుకుంటున్నా. ఇండియాకు ధోని ఆడాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. మేం ఎప్పుడు ఫీల్డ్‌లోకి అడుగుపెట్టినా మహీ మంచి సూచనలతో ముందుకొచ్చేవాడు. అలాంటి అడ్వయిజ్‌లు నా కెరీర్‌‌కు ఎంతో హెల్ప్‌ అయ్యాయి. అతడు గేమ్‌కు ముందు, తర్వాత ఎలాంటి సూచనలు ఇవ్వడు. ఆట జరుగుతున్నప్పుడు ఫీల్డ్‌లో పరిస్థితులను గమనించి వెంటనే అడ్వయిజ్‌లు ఇస్తాడు. విరాట్‌ కూడా ఇదే చేస్తాడు. కోహ్లీ గ్రేట్ మోటివేటర్. వీళ్లిద్దరినీ మినహాయిస్తే రోహిత్ కూడా నన్ను చాలా సార్లు గైడ్ చేశాడు. ఇలాంటి సీనియర్స్‌తో కలసి ఆడటాన్ని అదృష్టంగా భావిస్తున్నా" అని కుల్దీప్ పేర్కొన్నాడు.

గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌ కప్ తర్వాత నుంచి మాజీ కెప్టెన్ ధోని పెద్దగా మ్యాచెస్ ఆడింది లేదు. ఈ ఏడాది సమ్మర్‌‌లో ఐపీఎల్‌ ద్వారా బరిలోకి దిగుదామని భావించినా.. కరోనా వ్యాప్తితో టోర్నీ తాత్కాలికంగా వాయిదా పడింది. దీనితో.. ధోని ఫాన్స్ కి నిరాశ ఎదురైంది. తిరిగి ఈ మ్యాచ్ లు ఎపుడు ప్రారంభం అవుతాయో కూడా తెలియదు. ఫాన్స్ మాత్రమే కాదు.. పలువురు సహచర ఆటగాళ్లు కూడా ధోని ని క్రీజ్ లో చూడాలని ఎదురుచూస్తున్నారు.
First published: June 30, 2020, 7:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading