Home /News /sports /

KTR TWEET ABOUT 4 YEARS OLD KOLKATA CRICKETER SHEIKH SHAHID GETTING VIRAL IN SOCIAL MEDIA HSN

KTR- Sheikh Shahid: నాలుగేళ్ల బుడ్డోడు.. బంతిని బౌండరీలు దాటిస్తున్నాడు.. కేటీఆర్ ట్వీట్ వైరల్

క్రికెట్ ఆడుతున్న షేక్ షాహిద్

క్రికెట్ ఆడుతున్న షేక్ షాహిద్

కలకత్తా లోని బెహాళ ప్రాంతం పరిధిలోని ముచిపరాలో షేక్ షాహిద్ అనే నాలుగేళ్ల పిల్లాడు ఉన్నాడు. చిన్నపిల్లలతో కలిసి అతడు ఆటలాడతాడనుకుంటే పొరపాటే. ఎంచక్కా బ్యాట్ చేతపట్టుకుని బాల్ ను బౌండరీలు దాటిస్తున్నాడు. స్టార్ క్రికెటర్లు అంతా ఆ బుడ్డోడు క్రికెట్ ఆడుతున్న తీరుకు ఫిదా అవుతున్నారు.

ఇంకా చదవండి ...
    చిన్న పిల్లలు చేసే చేష్టలు చాలా ఫన్నీగా ఉంటాయి. వాళ్లకు తెలిసిన భాషలో మాట్లాడుతూ తల్లిదండ్రుల మోములో నవ్వును తెప్పిస్తారు. కనిపించిన వస్తువులతో ఆటలు ఆడుతూ ఉరుకులు పరుగులు పెడుతుంటారు. దాదాపుగా అయిదేళ్ల వయసు వరకు వారి లోకం వారిదే. బయటి ప్రపంచంతో వాళ్లకు సంబంధం లేదు. వారి ఆటలే సపరేటు. కానీ ఓ నాలుగేళ్ల బాలుడు మాత్రం అందుకు మినహాయింపు అనిపిస్తున్నాడు. నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ ను ఓ ఆటాడేస్తున్నాడు. కలకత్తాకు చెందిన ఆ చోటా క్రికెటర్ గురించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారాడు.

    కలకత్తా లోని బెహాళ ప్రాంతం పరిధిలోని ముచిపరాలో షేక్ షాహిద్ అనే నాలుగేళ్ల పిల్లాడు ఉన్నాడు. చిన్నపిల్లలతో కలిసి అతడు ఆటలాడతాడనుకుంటే పొరపాటే. ఎంచక్కా బ్యాట్ చేతపట్టుకుని బాల్ ను బౌండరీలు దాటిస్తున్నాడు. స్టార్ క్రికెటర్లు అంతా ఆ బుడ్డోడు క్రికెట్ ఆడుతున్న తీరుకు ఫిదా అవుతున్నారు. ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వ్యగాన్ అయితే ఏకంగా ఆ బుడ్డోడిని కలిసి సెల్ఫీ కూడా దిగారు. విరాట్ కొహ్లీ కూడా ఆ చోటా క్రికెటర్ వీడియోను షేర్ చేశారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆ షాహిద్ వీడియో గురించి రియాక్టయ్యారు.



    ’డైపర్ నుంచి నాలుగేళ్ల వయసుకు వచ్చేశాడు. దేశానికి ఘన విజయం సాధించి పెట్టాలన్న కలను సాకారం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడు‘ అంటూ షేక్ షాహిద్ ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీన్ని కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. దీంతో కేటీఆర్ ఆ వీడియోకు రియాక్షన్ ఇచ్చారు. ’అద్భుతమైన ప్రతిభాపాటవాలు కలిగిన ఈ బుడ్డోడి గురించి మీరేమంటారు వీవీఎస్ లక్ష్మణ్, హర్ష భోగ్లే..‘ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ వయసులోనే బాల్ ను బౌండరీలు దాటిస్తున్న బుడ్డోడిని నెటిజన్లు పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు. ఆ పిల్లాడి కళ్లు బాల్ మీదే ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యూచర్ వీవీఎస్ లక్ష్మణ్ అంటూ రియాక్షన్ ఇస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Cricket, Kolkata, KTR, VVS Laxman

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు