Rahul Dravid: అది రాహుల్ ద్ర‌విడ్ ఎఫెక్టేనా? లంకతో మ్యాచ్‌లో కృనాల్ ప్రవర్తనపై...

చరిత్‌ను కృనాల్ ఆలింగనం చేసుకున్న దృశ్యం

ఆదివారం శ్రీ‌లంక, ఇండియా మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఒక సంఘటన నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. 22వ ఓవ‌ర్‌లో కృనాల్ పాండ్యా.. లంక ఆటగాడు ధ‌నంజ‌య డిసిల్వాకు బౌలింగ్ చేస్తున్నాడు. పాండ్యా ధ‌నంజ‌యకు బాల్ వేయడం, అత‌డు దాన్ని నేరుగా బౌల‌ర్‌వైపు కొట్ట‌డం, ఆ బంతిని ఆపే క్ర‌మంలో కృనాల్ నాన్‌ స్ట్రైక‌ర్ చ‌రిత్ ఆశాలంక‌ను ఢీకొన‌డం.. క్షణాల్లో జరిగిపోయాయి.

  • Share this:
శ్రీ‌లంక‌లో ప‌ర్య‌టిస్తున్న భార‌త క్రికెట్ జ‌ట్టులో రియ‌ల్ రాహుల్ ఎఫెక్ట్ క‌నిపిస్తోందంటూ ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది. మూడు వ‌న్డేలు, మూడు టీ-ట్వంటీ మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక వెళ్ళిన భార‌త జ‌ట్టుకు ‘ది వాల్’ రాహుల్ ద్ర‌విడ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాహుల్ ద్ర‌విడ్ అంటేనే వివాదాల‌కు దూరంగా ఉంటాడు. మృదుస్వ‌భావి. గెలుపోటముల‌ను స‌మానంగా స్వీక‌రించే స్థిత‌ప్ర‌జ్ఞ‌త క‌లిగిన‌వాడు. అన్నింటికంటే ముఖ్యంగా క్రీజులో పాతుకుపోయి ప్ర‌త్య‌ర్థుల‌కు అడ్డుగోడ‌లా నిల‌బ‌డ‌తాడ‌నే పేరుంది. ఈయ‌న శిక్ష‌ణ‌లోనే అండ‌ర్ 19 క్రికెట్ జ‌ట్టు ఎంత‌గా ఎదిగిందో అంద‌రికీ తెలిసిందే. తాజాగా భార‌త క్రికెట్ యువర‌క్తాన్ని తీసుకువెళ్ళిన రాహుల్‌ద్ర‌విడ్‌పై అనేక ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇదంతా రియ‌ల్ రాహుల్ ఎఫెక్ట్ అంటూ నెటిజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఆదివారం శ్రీ‌లంక, ఇండియా మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఒక సంఘటన నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. 22వ ఓవ‌ర్‌లో కృనాల్ పాండ్యా.. లంక ఆటగాడు ధ‌నంజ‌య డిసిల్వాకు బౌలింగ్ చేస్తున్నాడు. పాండ్యా ధ‌నంజ‌యకు బాల్ వేయడం, అత‌డు దాన్ని నేరుగా బౌల‌ర్‌వైపు కొట్ట‌డం, ఆ బంతిని ఆపే క్ర‌మంలో కృనాల్ నాన్‌ స్ట్రైక‌ర్ చ‌రిత్ ఆశాలంక‌ను ఢీకొన‌డం.. క్షణాల్లో జరిగిపోయాయి. అయితే త‌రువాత కృనాల్ చ‌రిత్‌లు హ‌గ్ చేసుకోవ‌డం క్రికెట్ అభిమానులకు ఆకట్టుకుంది. సారీ చెప్పినట్టుగా కృనాల్ చరిత్‌ను దగ్గరకు తీసుకున్నాడు. దీంతో తన క్రీడా స్ఫూర్తికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదంతా కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ప్ర‌భావ‌మేనంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ర‌విశాస్త్రి, రాహుల్ ద్ర‌విడ్ ల‌మ‌ధ్య తేడాల‌ను చూపుతూ పుట్టుకొచ్చిన అనేక మీమ్‌లు సోష‌ల్‌మీడియాను హోరెత్తిస్తూ న‌వ్వులు పూయిస్తున్నాయి. కృనాల్, చ‌రిత్‌ల హ‌గ్ క్రీడాస్ఫూర్తికి నిద‌ర్శ‌మ‌ని, ఇదంతా రాహుల్ శిక్ష‌ణ వ‌ల్లే అబ్బింద‌ని కొంద‌రు వ్యాఖ్యానించ‌గా.. క్రికెట్ మైదానంలో జ‌రిగే ఓ సాధార‌ణ సంఘ‌ట‌నను రాహుల్‌కు ముడిపెట్ట‌డం ఎందుకని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటివి క్రికెట్ ఫీల్డ్‌లో మామూలే అని మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు.

ఇక ఆదివారం జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో భార‌త క్రికెట్ టీమ్ దుమ్ములేపిసింది. సింహ‌ళీయుల‌ను ఒక ఆట ఆడేసుకుంది. కెప్టెన్ శిఖ‌ర్ ధ‌వ‌న్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌, (95 బంతుల్లో 86 నాటౌట్‌), పృధ్వీషా మెరుపులు (24 బంతుల్లో 43ప‌రుగులు)ఇషాన్‌కిషాన్ బుల్లెట్‌లాంటి షాట్ల‌తో( 42 బంతుల్లో 59ప‌రుగులు) ప్రేమ‌దాస స్టేడియాన్ని హోరెత్తించారు. తొలుత శ్రీ‌లంక 9 వికెట్ల న‌ష్టానికి 262 ప‌రుగులు చేయ‌గా, భార‌త‌జ‌ట్టు ఈ ల‌క్ష్యాన్ని కేవ‌లం 36.4 ఓవ‌ర్ల‌లో మూడువికెట్ల న‌ష్టానికే చేధించి త‌న స‌త్తా చాటింది.
Published by:Sambasiva Reddy
First published: