KOLKATA KNIGHT RIDERS TWITTER POST ON MS DHONI GOES VIRAL AND RAVINDRA JADEJA GIVES STRONG REPLY TO KKR FOR THIS REASON SRD
MS Dhoniని అవమానించిన KKR... నైట్ రైడర్స్ తిక్క కుదిర్చిన జడేజా..
MS Dhoni - Ravindra Jadeja
MS Dhoni : ధోని లాంటి దిగ్గజ ప్లేయర్ ను విదేశీ ఆటగాళ్లు కూడా గౌరవిస్తారు. విదేశాల్లో కూడా మహీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కానీ, కోల్ కతా నైట్ రైడర్స్ ధోనిని కించపర్చేలా ప్రవర్తించింది. అయితే, కేకేఆర్ కు రవీంద్ర జడేజా సరియైన కౌంటరిచ్చాడు.
మహేంద్రసింగ్ ధోనీ (Mahendra Singh Dhoni).. కెప్టెన్‌గా, ఆటగాడిగా టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలు అందించిన ఇతని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం ఆటతోనే కాకుండా తోటి క్రికెటర్లు, ఇతర జట్ల ఆటగాళ్లతో అతను వ్యవహరించే తీరుతో కోట్లాది మంది అభిమానుల మనసులు గెల్చుకున్నాడీ జార్ఖండ్ డైనమైట్. అలాంటి క్రికెటర్ ను విదేశీ ప్లేయర్లు కూడా గౌరవిస్తారు. కానీ, కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) మాత్రం ధోనిని ఉద్దేశించి అవమానించేలా పోస్ట్ చేసింది. వివరాల్లోకెళితే.. ధోనిని ఉద్దేశించి ఐపీఎల్ ప్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ధోని అభిమానులతోపాటు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) అభిమానులు కూడా ఆ ఫోటోపై మండిపడుతున్నారు. తమ అభిమాన క్రికెటర్‌ను కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ ఫోటో ఏమిటంటే ఆదివారం యాషెస్ సిరీస్ (Ashes Series)లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ ముగిసింది.
చివరి రోజు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. గెలుపు కోసం ఆస్ట్రేలియా, డ్రా కోసం ఇంగ్లండ్ చివరి వరకు పోరాడాయి. అయితే మ్యాచ్ చివర్లో ఆస్ట్రేలియా జట్టు తమ ఫీల్డర్లందరినీ బ్యాటర్లకు దగ్గరకు మోహరించింది. ఆ సమయంలో ఇంగ్లండ్ టేలండర్లు బ్రాడ్, అండర్సన్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా ఎన్ని వ్యూహ్యాలు రచించినప్పటికీ చివరకు మ్యాచ్ డ్రాగానే ముగిసింది.
అయితే ప్రస్తుతం ఉన్న ఆ ఫోటోను, 2016లో ఐపీఎల్లో ధోని బ్యాటింగ్ చేసిన ఫోటోను పోలుస్తూ కోల్‌కతా నైట్ రైడర్స్ తమ ట్విట్టర్ ఖాతాలో ఓ ఫోటోను షేర్ చేసింది. టెస్టు క్రికెట్లో ఈ క్లాసిక్ మూవ్ టీ20 ఫార్మాట్లో మాస్టర్ స్ట్రోక్‌ను గుర్తుకు తెస్తుందంటూ దీనికి ఓ క్యాప్షన్ కూడా పెట్టింది. ఆ ఫోటోలో ధోని బ్యాటింగ్ చేస్తుండగా కోల్‌కతా జట్టు బౌలర్‌తో కలిపి ఏకంగా ఆరుగురు ఫీల్డర్లను బ్యాటర్లకు దగ్గరగా మోహరించింది.
అయితే ఈ ఫోటో ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. కాగా ఆ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ లేకపోవడంతో ధోని.. రైజింగ్ పుణే తరఫున ఆడాడు. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్, ధోని సహచరుడు రవీంద్ర జడేజా ఈ ఫోటోపై స్పందించాడు. అంతేకాకుండా కోల్‌కతా నైట్ రైడర్స్ ట్వీట్‌కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. అది మాస్టర్ స్ట్రోక్ కాదు.. షో ఆఫ్ మాత్రమే అంటూ రాసుకొచ్చాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇచ్చిన ఈ కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోల్ కతా నైట్ రైడర్స్ తిక్కను జడేజా కుదిర్చాడంటూ CSK ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
ఐపీఎల్లో 2022లోనూ రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే ఆడనున్నాడు. రవీంద్ర జడేజాకు ధోని కంటే ఎక్కువగా చెల్లించి చెన్నై జట్టు రిటెన్షన్ చేసుకుంది. తమ రిటెన్షన్ జాబితాలో జడ్డూకు చెన్నై మొదటి స్థానం కల్పించింది. ఇందుకుగాను జడేజా 16 కోట్ల రూపాయలను అందుకోనున్నాడు. జడేజా తర్వాత ధోనీకి 12 కోట్ల రూపాయల వేతనాన్ని చెల్లించనుంది సీఎస్కే.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.