Home /News /sports /

Pat Cummins : మంచి మనస్సు చాటుకున్న ప్యాట్ కమిన్స్..కరోనాపై పోరులో భారత్ కు సాయం..

Pat Cummins : మంచి మనస్సు చాటుకున్న ప్యాట్ కమిన్స్..కరోనాపై పోరులో భారత్ కు సాయం..

Pat Cummins : మంచి మనస్సు చాటుకున్న ప్యాట్ కమిన్స్..కరోనాపై పోరులో భారత్ కు సాయం..

Pat Cummins : మంచి మనస్సు చాటుకున్న ప్యాట్ కమిన్స్..కరోనాపై పోరులో భారత్ కు సాయం..

Pat Cummins : రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆక్సిజన్ అందక, సరైన సమయంలో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోసారి దేశం లాక్ డౌన్ వైపుగా అడుగులు వేస్తోంది. ఇలాంటి సమయంలో ఎంతో మంది దాతలు భారత్ ను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు.

ఇంకా చదవండి ...
    కరోనా..మానవాళి నుదుటి మీద రాస్తున్న మరణశాసనానికి తెరపడటం లేదు. ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్ తో సతమతమవుతున్నాయ్. ఇక, భారత్ లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆక్సిజన్ అందక, సరైన సమయంలో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోసారి దేశం లాక్ డౌన్ వైపుగా అడుగులు వేస్తోంది. ఇలాంటి సమయంలో ఎంతో మంది దాతలు భారత్ ను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. చాలా మంది తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ప్రముఖ ఆస్ట్రేలియన్ పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) చేరిపోయాడు. కరోనాపై పోరులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ పీఎం కేర్స్ కు 50 వేల డాలర్లను సాయంగా ప్రకటించాడు. కరోనాపై పోరులో తన సాయం చిన్నదని తెలిసినా..ఎవరికో ఒకరికి సాయపడుతోందని ఆశిస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నాడు కమిన్స్.

    " నాకు భారతదేశం అంటే ఎంతో ఇష్టం. ఐపీఎల్ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పడు ఇక్కడి సంప్రదాయాలు, ఆటగాళ్లపై గౌరవాన్ని చూసి ఫిదా అయిపోయాను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా విధ్వంసంతో దేశం అల్లాడిపోతోంది. ఈ సమయంలో ఐపీఎల్ ఆడటం మంచిదో కాదో పక్కన పెడితే.. మా ఆట ద్వారా కొంతమందికైనా వినోదం అందిస్తున్నము. ఇలాంటి కష్టకాలంలో మా ఆట వాళ్లకి ఆనందం ఇస్తే మాకు అది ఎంతో తృప్తినిస్తోంది. ఈ సందర్భంగా పీఎం కేర్స్ కి 50 వేల డాలర్ల విరాళం ఇస్తున్నాను. ఈ సాయం ఎంతో చిన్నది అని భావిస్తున్నాను. కానీ, ఇది ఎవరికో ఒకరికైనా సాయపడుతోందని ఆశిస్తున్నాను " అని కమిన్స్ ట్విట్టర్ లో తన సందేశాన్ని పంచుకున్నాడు.


    కమిన్స్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విదేశీ క్రికెటర్ అయినా సాయం చేయడంపై ఎంతో మంది ప్యాట్ కమిన్స్ ని అభినందిస్తున్నారు. అతన్ని చూసైనా భారత క్రికెటర్లు నేర్చుకోవాలంటూ టీమిండియా ప్లేయర్లకు చురకలు అంటిస్తున్నారు. ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బౌలింగ్ లో అంతగా ఆకట్టుకోపోయినా..బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తున్నాడు ఈ ఆసీస్ ప్లేయర్.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Corona, IPL 2021, Kolkata Knight Riders

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు