KOLKATA KNIGHT RIDERS STAR PLAYER DINESH KARTHIK PRAISES JATHI RATHNALU MOVIE SRD
Jathi Rathnalu : భయ్యా.. జాతి రత్నాలు కిర్రాక్ గా ఉంది.. సినిమాకు టీమిండియా క్రికెటర్ ఫిదా..
‘జాతి రత్నాలు’ మూవీ (Twitter/Photo)
Jathi Rathnalu : తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ దుమ్ము లేపిన జాతి రత్నాలు.. ఓటీటీలో కూడా దూసుకుపోతోంది. సెలబ్రిటీలు కూడా ఈ సినిమాకు మంచి మార్కులే వేశారు. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి.
జాతి రత్నాలు (Jathi Rathnalu) ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ మూవీ. చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాతి రత్నాలు సినిమా పెద్ద విజయాన్నే సాధించింది. నిర్మాతలకు కాసుల పంట కురిపించింది. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో జాతి రత్నాలు సినిమా ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కరోనా మహమ్మారి భయంతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు ఈ సినిమా 'కామెడీ టీకా' ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ దుమ్ము లేపిన జాతి రత్నాలు.. ఓటీటీలో కూడా దూసుకుపోతోంది. సెలబ్రిటీలు కూడా ఈ సినిమాకు మంచి మార్కులే వేశారు. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, కోల్‌కతా నైట్ రైడర్స్ వైస్ కెప్టెన్ దినేష్ కార్తీక్ కూడా జాతి రత్నాలు సినిమాపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. సినిమా బాగుందని, డైలాగ్స్ సూపర్ అని ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారని డీకే పేర్కొన్నాడు. డీకేకు తెలుగు కూడా వచ్చన్న విషయం తెలిసిందే.
JATHI RATHNALU
My goodness, what a laugh riot.I kept laughing in every scene.Amazing dialogues, outstanding direction and incredible performances by each n every one.More power to you guys. This is one genre that's probably the toughest and you guys aced it.Outstanding ❤️❤️❤️
" ఓ మై గాడ్.. ఏమా నవ్వుల అల్లర్లు. నేను ప్రతి సన్నివేశంకు నవ్వాను. సినిమాలో అద్భుత డైలాగ్స్ ఉన్నాయి. సూపర్ డైరెక్షన్. ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు. 'జాతి రత్నాలు' మంచి ఉల్లాసాన్ని ఇచ్చింది. ఇలా నవ్వించడం చాలా కష్టం. కానీ మీరు బాగా చేశారు. ఎంత కష్టపడ్డారో తెరపై తెలుస్తుంది. ఔట్ స్టాండింగ్ ఫెర్ఫామెన్స్" అని కోల్‌కతా నైట్ రైడర్స్ వైస్ కెప్టెన్ దినేష్ కార్తీక్ త ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఇటీవలే మంత్రి కేటీఆర్ కూడా 'జాతిరత్నాలు'పై ప్రశంసల జల్లు కురిపించారు.
నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం 'జాతి రత్నాలు'. అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో అప్పటికే ప్రేక్షకులకు దగ్గరైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బంపర్ హిట్ కొట్టింది. ఇక, గతేడాది కోల్ కతా నైడరైడర్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న కార్తీక్.. ఆ జట్టు లో కీ రోల్ పోషిస్తున్నాడు. మిడిలార్డర్ లో మంచి ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.