• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • KOLKATA KNIGHT RIDERS PACER PRASDIH KRISHNA TESTS POSITIVE FOR COVID 19 SA

వదల బొమ్మాళీ వదల.. మరో ఐపీఎల్ ఆటగాడికి కరోనా!

వదల బొమ్మాళీ వదల.. మరో ఐపీఎల్ ఆటగాడికి కరోనా!

ఐపీఎల్‌లో మొదటిసారి కలకలం రేగింది. కోల్ కతా ప్లేయర్లు సందీప్ వారియర్, మిస్టరీ లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కరోనా బారిన పడ్డారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసింది. కరోనా వైరస్ ఐపీఎల్‌ను సజావుగా సాగనివ్వలేదు.

  • Share this:
    క్రీడారంగాన్ని కరోనా అతలాకుతలం చేస్తుంది. ఈ మహమ్మారి కారణంగా చాలా ఈవెంట్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా కరోనా కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసింది. కరోనా వైరస్ ఐపీఎల్‌ను సజావుగా సాగనివ్వలేదు. బయోబబుల్ లాంటి కఠిన నిబంధనల మధ్య ఐపీఎల్ నిర్వహించనప్పటికి ఆటగాళ్ళ మధ్యలోకి వైరస్ దూరిపోయింది. దీంతో ఐపీఎల్‌ను అర్ధంతరంగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెుదటిగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ టీమ్‌కు చెందిన వరుణ్ చక్రవర్తి మెుదలైన పాజీటివ్ కేసులు వృద్దిమాన్ సాహా,సందీప్ వారియ‌ర్‌, న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్ క‌రోనా బారిన‌ప‌డ్డారు. తాజాగా మరో కేకేఆర్ ఆటగాడు కరోనా బారిన పడ్డాడు.పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.



    ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌ కోసం భారత్ జట్టు త్వరలోనే అక్కడకి వెళ్ళనుంది. అయితే ఈ ఐదు టెస్టుల సిరీస్‌ కోసం ప్రకటించిన జ‌ట్టులో ప్రసిద్ధ్ కృష్ణ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అతనికి కరోనా సోకడం జట్టుకు కొంత ఆందోళనకు గురిచేసింది.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు