IPL 2021 సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కొన్ని కీలక మార్పులు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లను బయటకు పంపేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. కేకేఆర్ మాజీ కెప్టెన్ దినేష్ కార్తీక్, స్పిన్నర్ కుల్దీప్ సింగ్, పాట్ కమిన్స్‌లను వదిలించుకునేందుకు జట్టు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. దినేష్ కార్తీక్ 2018లో మెగా ఆక్షన్ ద్వారా జట్టులోకి వచ్చాడు. అతడికి కేకేఆర్ ఫ్రాంచైజీ రూ.7.4 కోట్లు చెల్లిస్తోంది. ఇక కుల్దీప్ యాదవ్ 2014 నుంచి జట్టుతో ఉన్నాడు. అతడికి రూ.4 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఇద్దరు గత సీజన్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఐపీఎల్ 2019లో కేవలం నాలుగు వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2020లో కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అదే సమయంలో వరుణ్ చక్రవర్తి మెరుగైన ప్రదర్శన చూపాడు. ఐపీఎల్ 2020లో అతడు చూపిన టాలెంట్‌ను చూసిన బీసీసీఐ అతడికి టీమిండియాలో అవకాశం కల్పించింది. ఈ ఇద్దరు సభ్యులను వదులుకుంటే కేకేఆర్ జట్టుకు రూ.14కోట్ల వరకు మిగులుతుంది.
ఇక ఐపీఎల్ 2020లో అత్యంత ఎక్కువ ధర పలికిన పాట్ కమిన్స్ (రూ.15.5 కోట్లు)ను కూడా వదులుకోవడానికి కోల్‌కతా నైట్ రైడర్స్ సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2021 సీజన్ ఆక్షన్‌కు ముందే దీనిపై నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు ఏవైనా జట్లు తమ ఆటగాళ్లను వదులుకోవాలంటే జనవరి 21వ తేదీ లోపు ఆ వివరాలను ఐపీఎల్ మేనేజ్‌మెంట్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందుబాటులో ఉండే ఆటగాళ్లను వేలం వేస్తారు. ఫిబ్రవరి 4న ఐపీఎల్ 2021 కోసం ఆటగాళ్ల వేలం ఉండే అవకాశం ఉంది. అయితే, వేలం ఎక్కడ నిర్వహిస్తారనేది ఇంకా వేదిక ఖరారు కాలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, IPL 2020, Kolkata Knight Riders