KOLKATA KNIGHT RIDERS CO OWNER JUHI CHAWLA MADE SOME INTERESTING COMMENTS ON SHAH RUKH KHAN AND SAYS BOLLYWOOD HERO SCOLDS HER WHEN KKR IS LOSING IPL MATCH SRD
Shah Rukh Khan: " KKR సరిగ్గా ఆడకుంటే షారుఖ్ ఖాన్ నన్ను దారుణంగా తిట్టేవాడు " .. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు ..
Shah Rukh Khan - Juhi Chawla
Shah Rukh Khan: అటు సినిమాల్లోనే కాదు.. క్రికెట్ (Cricket) లోనూ షారుఖ్ ఖాన్ కు బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు ఐపీఎలే కారణం. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) టీంకు షారుఖ్ యజమాని. కోల్ కతా మ్యాచులు జరిగేటప్పుడు షారుఖ్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు.
బాలీవుడ్ (Bollywood) సినిమాల ట్రెండ్ మార్చిన బాద్షా అతను. ఒక్కో అవకాశాన్ని.. ఒక్కో మెట్టుగా మార్చుకుంటూ..నంబర్ వన్ పొజిషన్ కు చేరిన.. కింగ్ ఆఫ్ బాలీవుడ్. అమ్మాయిల మనసుదోచుకున్న కింగ్ ఆఫ్ రొమాన్స్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల గుండెల్లో నిలిచిన కింగ్ ఖాన్. బాలీవుడ్ రికార్డులను తిరగరాసిన సామ్రాట్. తన ఇంటిపేరునే కింగ్ గా మార్చుకున్నాడు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan). అటు సినిమాల్లోనే కాదు.. క్రికెట్ (Cricket) లోనూ షారుఖ్ ఖాన్ కు బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు ఐపీఎలే కారణం. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) టీంకు షారుఖ్ యజమాని. కోల్ కతా మ్యాచులు జరిగేటప్పుడు షారుఖ్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. తన ఎక్స్ ప్రెషన్స్ తో గ్రౌండ్ లో ఫ్యాన్స్ కు బోలెడంత మజా అందిస్తాడు. తన టీమ్ గెలిచినప్పుడు ఫ్లయింగ్ కిస్సులతో ఫ్యాన్స్ ను అలరిస్తాడు. ఇలాంటి షారుఖ్ కెమెరా ముందు గానీ వెనకాల గానీ కోప్పడటం చాలా అరుదు. అయితే షారుక్ మాత్రం తనను దారుణంగా తిట్టాడని ప్రముఖ బాలీవుడ్ నటి, కోల్కతా నైట్ రైడర్స్ సహా యజమాని జూహీ చావ్లా (Juhi chawla) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ షోలో పాల్గొన్న జూహీ చావ్లా.. ఏదైనా మ్యాచ్ చూసేప్పుడు కేకేఆర్ (KKR) ఓడిపోతే కంట్రోల్ కోల్పోతాడని, తనను తిడతాడని చెప్పుకొచ్చింది.
హిందీలో ఫేమస్ అయిన కపిల్ (Kapil Talk show) టాక్ షో లో జూహీ చావ్లా పాల్గొంది. ఆ షో సందర్భంగా వ్యాఖ్యాత కపిల్ అడిగిన ప్రశ్నలకు జుహీ చావ్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. " ఒకవేళ కోల్ కతా ఆటగాళ్లు సరిగా ఆడకుంటే నన్ను తిట్టేవాడు. ఏదైనా మ్యాచ్ జరుగుతుండగా.. " అరేయ్.. అతడేంటి అలా బౌలింగ్ చేస్తున్నాడు. ఫీల్డింగ్ కు తగ్గట్టు బంతి వేయాలి కదా. ఇది కరెక్ట్ కాదు.. నేను టీమ్ మీటింగ్ పెట్టాలి.. " అనేవాడు. అంతటితో ఆగకుండా నన్ను కూడా తిట్టేవాడు.. కానీ నాకు ఆ సమయంలో ఏం చేయాలో తోచదు.." అని తెలిపింది.
బాలీవుడ్ లో పలు చిత్రాల్లో కలిసి నటించిన షారుక్ ఖాన్-జూహీ చావ్లాలు.. కేకేఆర్ జట్టుకు యజమాని, సహ యజమానిగా ఉన్న విషయం తెలిసిందే. వీరిరువురి మధ్య వృత్తిపరమైన సంబంధాలే గాక.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. షారుక్ అభిమానించే అతికొద్ది మందిలో జూహీ చావ్లా ఒకరు. అయితే, కపిల్ షోలో ఆమె ఫన్నీగా చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ, వెంకటేశ్ అయ్యర్ లను రిటైన్ చేసుకుంది కోల్ కతా. ఇక, లేటెస్ట్ గా జరిగిన ఐపీఎల్ 2021 సీజన్ లో కూడా దుమ్మురేపింది కేకేఆర్. ఫైనల్ కు చేరిన ఆ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఇక, ఐపీఎల్ లో ఇంతవరకు రెండు టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది కోల్ కతా నైట్ రైడర్స్ టీం.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.