రెండురోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగావేలం (IPL Auction 2022) విజయవంతమైంది. కొందరు ఆటగాళ్లు జాక్‌పాట్ దక్కించుకుంటే.. మరికొందరికి నిరాశే మిగిలింది. ఎక్కువ మొత్తం దక్కించుకుంటారనుకున్న ప్లేయర్లకు భంగపాటు ఎదురైంది. అయితే ఈసారి వేలంలో ఆటగాళ్లతో పాటు ఒక 19 ఏళ్ల అమ్మాయి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన చురుకుదనంతో చూపు తిప్పుకోకుండా చేసింది. తన చార్మింగ్ లుక్‌తో వేలంలో అందరి దృష్టి తనవైపు ఉండేలా చేసుకుంది. ఎవరా బ్యూటీ గర్ల్ అంటూ టీవీల్లో ఆమెను చూసిన వారంతా ముచ్చటపడ్డారు. కొందరు గుర్తుపట్టారు కూడా. ఆమే.. జాహ్నవి మెహతా (Jahnavi Mehta). కోల్‌కతా (Kolkata Knight Riders) టీం సహా యజమాని, బాలీవుడ్ నటి జూహీ చావ్లా (Juhi Chawla) కూతురు. కోల్‌కతా తరఫున షారుఖ్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ (Aryan Khan), కుమార్తె సుహానా (Suhana)లతో కలిసి వేలంలో పాల్గొన్నారు జూహీ చావ్లా తనయురాలు జాహ్నవి మెహతా. ఆమె ఆకర్షణీయ రూపం... ఆ కళ్లలో మేజిక్ అందరినీ ఆకర్షించింది. నెట్టింట ఆమె పేరు మారుమోగిపోయింది. ముఖ్యంగా జాహ్నవి వ్యవహరించిన తీరు నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ అయ్యాయి.
అయితే, బాలీవుడ్ నటి జూహీ చావ్లా పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు. తన కుమార్తె జాహ్నవి మెహతా తమ ఫ్రాంఛైజీ వ్యవహారాల్లో మమేకం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూహీ చావ్లా కూతురును ఉద్దేశించి భావోద్వేగ పోస్టు చేశారు. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలతో కూడిన వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు.
"చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచే ఐపీఎల్‌తో పాటు ఇతర క్రికెట్ ఈవెంట్లు చూడటం కూడా అలవాటుగా మార్చుకుంది. కామెంటేటర్ల వ్యాఖ్యలు శ్రద్ధగా వినేది. తనకు 12 ఏళ్ల వయసు ఉన్నపుడు అనుకుంటా.. మేం సెలవుల కోసం బాలి వెళ్లినపుడు కాఫీ టేబుల్ మీద ఉన్న టెలిఫోన్ డైరెక్టరి సైజులో ఓ పుస్తకం... అందులో క్రికెటర్ల జీవిత చరిత్రలు, రికార్డులు, వారు సాధించిన విజయాలు.. ఇలా అన్నీ ఉన్నాయి.
ఆ బుక్ చదవడం పూర్తి చేయాలనే పిచ్చి పట్టింది తనకు. స్విమ్మింగ్ విరామ సమయంలో పూల్ ఒడ్డున కూర్చుని ఒక్క పేజీ కూడా వదలకుండా ఆ బుఖ్ చదివింది. ఇది చాలా అసహజమైన విషయం కదా! 12 ఏళ్ల పిల్ల ఇంతలా ఒక విషయం గురించి ఆలోచించడం! వయసు పెరిగే కొద్దీ తనలో క్రికెట్ పట్ల ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది. క్రికెట్ గురించి మాట్లాడితే తన ముఖం మతాబులా వెలిగిపోతుంది. మూడేళ్ల క్రితం.. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కురాలిగా జాహ్నవి 17 ఏళ్ల వయసులో రికార్డు సాధించింది.
View this post on Instagram
ఆర్యన్‌తో కలిసి జాహ్నవి వేలంలో పాల్గొంది. ఈసారి సుహానా కూడా వాళ్లతో చేరింది. దీనంతటికీ కారణమైన మా సీఈఓ వెంకీ మైసూర్‌కు ధన్యవాదాలు. జాహ్నవి అభిప్రాయాలకు విలువనిస్తూ... తనను ప్రోత్సహించారు. ఆమె అతడిని ఆప్యాయంగా ‘కోచ్’ అని పిలుస్తుంది. తన మనసంతా ఆట మీదే. ఒక తల్లిగా నా చిట్టితల్లిని చూసి గర్వపడుతున్నా. దేవుడి ఆశీర్వాదాలతో తన భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలి " అని అంటూ ఉద్వేగభరిత క్యాప్షన్ జోడించారు జూహీ చావ్లా.
రెండేళ్ల క్రితం జరిగిన ఐపీఎల్ వేలంలోనూ ఆమె పార్టిసిపేట్ చేసింది. ఇది సెంకడ్ టైమ్. తల్లి జూహ్లీ చావ్లా తోడు లేకుండానే.. కోల్‌కతా నైట్ రైడర్స్ వేలంలో యాక్టివ్‌గా వ్యవహరించడం విశేషం. ఆమె ఛార్మింగ్‌తో కెమెరాలన్నీ అటువైపే ఫోకస్ చేశాయి. జాహ్నవి విదేశాల్లో డిగ్రీ పూర్తి చేసివచ్చి.. ప్రస్తుతం కేకేఆర్ వ్యవహారాలు చూస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IPL 2022, IPL Auction 2022, Kolkata Knight Riders, Shah Rukh Khan