IPL 2021: ఫ్యాన్స్​కు ఆర్​సీబీ​ మరో ‘సారీ’.. ఎలిమినేటర్​ మ్యాచ్​లో కోలకతా చేతిలో పరాజయం

(Photo: IPL?twitter)

ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్​ క్వాలిఫయర్ ‌‌2 మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూర్​పై కోలకతా నైట్​ రైడర్స్​ విజయం సాధించింది. 139 పరుగుల లక్ష్యాన్ని కోలకత 6 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది.

  • Share this:
    ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్​ ఎలిమినేటర్ మ్యాచ్ (Eliminator) లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూర్ (Royal challengers Bangalore)​పై కోలకతా నైట్​ రైడర్స్​ (Kolkata night riders) విజయం సాధించింది.  తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 138 పరుగులు చేసింది. 139 పరుగుల లక్ష్యాన్ని కోలకతా ఆరు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది.  గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రానా, సునీల్ నరైన్ రాణించడంతో ఆ జట్టు అద్భుత విజయాన్ని అందుకుని క్వాలిఫైయర్-2లో ఢిల్లీ (DC)తో తలబడనుంది. చేయాల్సిన స్కోరు తక్కువ ఉండటంతో కోలకతా బ్యాట్స్​మన్​ ఆది నుంచి ఒత్తిడి లేకుండా ఆడినా.. మధ్యలో చాహల్​ ( 4‌‌‌‌ ‌‌-0-16-2),   హర్షల్​ పటేల్​ (4-0-19-2) కట్టడి చేశారు. అయితే బ్యాటింగ్​ ఆర్డర్లో ముందు వచ్చిన సునీల్​ నరైన్​ వీర విహారం చేయడంతో కోలకతా టార్గెట్ చేధించింది.

    టాస్​ గెలిచినా..

    టాస్‌ గెలిచిన బెంగళూరు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.  ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెంటనే ఆర్‌సీబీ (RCB) బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడారు. ఈ క్రమంలోనే మొదటి నుంచి భారీ షాట్‌లతో జట్టు స్కోరును పెంచే పనిలో పడ్డారు.

    విరాట్‌ కోహ్లీ (Virat Kohli) 22 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఇక కోహ్లీకి మద్దతుగా నిలిచిన దేవదత్ పడిక్కల్‌ కూడా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే పడిక్కల్‌ అవుట్‌ అయిన తర్వాత బ్యాట్స్‌మెన్‌ పెద్దగా రాణించలేదు. బ్యాట్స్‌మెన్‌ వెంట వెంటనే పెవిలియన్‌ బాటపట్టారు. ఫామ్​లో ఉన్నశ్రీకర్​ భరత్​, మ్యాక్స్​వెల్​ తొందరగా అవుటవడంతో బెంగళూర్​ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న డివిలియర్స్​ సైతం పరుగులు చేయకపోవడంతో ఆర్​సీబీ భారీ స్కోరు చేయలేకపోయింది. ఇక కోల్‌కతా (Kolkata) బౌలింగ్ విషయానికొస్తే అత్యధికంగా సునీల్‌ నరైన్‌  4 వికెట్లను పడిగొట్టాడు. 4 ఓవర్‌లలో కేవలం 21 పరుగులు ఇవ్వడం విశేషం. తర్వాత ఫెర్గూసన్ 4 ఓవర్‌లలో 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్‌లలో ఏడు వికెట్ల నష్టానికి ఆర్‌సీబీ 138 పరుగులు చేసింది. దీంతో కోలక్‌తా విజయానికి 139 పరుగులు చేయాల్సి ఉంది.

    కోలకతా నెమ్మదిగా..

    కోల్‌కతా ఇన్నింగ్స్ కూడా కాస్త మెల్లగానే ప్రారంభం అయింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (29: 18 బంతుల్లో, నాలుగు ఫోర్లు), వెంకటేష్ అయ్యర్ (26: 30 బంతుల్లో, ఒక సిక్సర్) మెల్లగానే ఆడటంతో కోల్‌కతా మొదటి ఐదు ఓవర్లలో 40 పరుగులు చేసింది. బెంగళూరు తరహాలోనే ఇన్నింగ్స్ ఆరో ఓవర్లోనే కోల్‌కతా కూడా మొదటి వికెట్ కోల్పోయింది.  గిల్ అవుటయ్యాడు. తర్వాతి ఓవర్లోనే ఫాంలో ఉన్న రాహుల్ త్రిపాఠి (6: 5 బంతుల్లో, ఒక ఫోర్) కూడా అవుటయ్యాడు. దీంతో కోల్‌కతా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా కోల్‌కతా ఇన్నింగ్స్ నెమ్మదిగానే నడిచింది. 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా రెండు వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. మిడిల్ ఓవర్లలో హర్షల్ పటేల్​, చహల్​ కోలకతా బ్యాట్స్​మన్​ను కట్టడి చేశారు.

    నరైన్​ రాకతో..

    ఆ తర్వాత 11వ ఓవర్లో వెంకటేష్ అయ్యర్ అవుటయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన సునీల్ నరైన్ (26: 15 బంతుల్లో, మూడు సిక్సర్లు) మ్యాచ్‌ను మలుపు తిప్పే ఇన్నింగ్స్ ఆడాడు. డాన్ క్రిస్టియన్ బౌలింగ్‌లో మూడు బంతులను సిక్సర్లుగా తరలించాడు. దీంతో ఆ ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. అక్కడ మ్యాచ్ పూర్తిగా కోల్‌కతా చేతుల్లోకి వచ్చింది.  చివరి మూడు ఓవర్లలో 15 పరుగులు చేయాల్సిన పరిస్థితి కోలకతాది. చేతిలో ఆరు వికెట్లున్నాయి. ఇక 18వ ఓవర్లో​ రాయల్స్​ బౌలర్​ సిరాజ్​ రెండు వికెట్లు తీసి కోలకతాను ఇబ్బందులోకి నెట్టాడు. ఆ ఓవర్లో కేవలం మూడు పరుగులే వచ్చాయి. ఆ తర్వాత 19 ఓవర్లో గార్టన్​ ఐదు పరుగులే ఇవ్వడంతో చివరి ఓవర్లో కోలకతాకు 7 పరుగులు అవసరం అయ్యాయి.  అయితే షకీబుల్ హాసన్​ 19 వ ఓవర్లో మొదటి బంతికే  ఫోర్​ కొట్టడంతో కోలకతా పని సులువయింది. అనుభవజ్ఙులైన మోర్గాన్​, షకీబుల్​ హాసన్​ తమ జట్టును 19.4 ఓవర్లలో విజయతీరాలకు చేర్చారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, హర్షల్ పటేల్, చాహల్ తలా రెండు వికెట్లు తీశారు. అయితే ఈ సీజన్​కు మాత్రమే ఆర్​సీబీ జట్టుకు కెప్టెన్​గా ఉంటానని ఇప్పటికే కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
    Published by:Prabhakar Vaddi
    First published: