Virat Kohli True Love : నెట్టింట వైరల్‌గా మారిన విరాట్ కోహ్లీ ట్రూ లవ్ లెటర్.. ఈ లెటర్ చదివి మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి

నెట్టింట వైరల్‌గా మారిన కోహ్లీ ట్రూ లవ్ లెటర్

విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడో రాసిన పాత లవ్ లెటర్ ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ లవ్ లెటర్‌లో ఏమున్నదంటే...

  • Share this:
    టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గతంలో తాను రాసిన పాత లవ్ లెటర్ ఒక దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. ఇన్‌స్టా స్టోరీ రూపంలోపెట్టిన ఆ లవ్ లెటర్ చూసి నెటిజెన్లు కోహ్లీ లోని మరో కోణానికి ముగ్దులవుతున్నారు. విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ లెటర్ రాసింది మాత్రం అనుష్కకు కారు. అనుష్కకు కాకుండా ఇంకా ఎవరికి రాశాడని మీకు డౌటనుమానమా? అయితే మీరే చదవండి.. 'డియర్ పొటాటో (ఆలుగడ్డ), నువ్వు నా నిజమైన ప్రేమ అని గుర్తించి నీకు ఈ లెటర్ రాస్తున్నాను. నాకు ఇప్పటికీ మనం మొదటి సారి కలుసుకున్నది గుర్తు ఉన్నది. ఆ రోజు నిన్ను ఒక పరాఠా లోపల చూశాను. ఇప్పటికీ నాకు గుర్తు ఉన్నది. నా చిన్నతనంలో నిన్ను కిరాణా కొట్టు నుంచి ఇంటికి తీసుకొని వచ్చే వాడిని. నిన్ను థియేటర్లో కూడా కలుసుకునే వాడిని. నిన్ను నా చేతుల్లో పట్టుకొని ఉండగా.. నీపై రెడ్ కెచప్ కవర్ చేయబడి ఉండేది. కానీ ఇప్పుడు నీవు లేకుండా జీవితం పరిపూర్ణం కాదని నేను గుర్తించాను. నువ్వు లేని అలూ లెస్ గోబీ బాధపడుతున్నది. బఠానీలు బాధపడుతున్నాయి. నువ్వు దూరమయ్యాక జీలకర్ర చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నది. నువ్వు లేకపోవడం వల్ల నా మాసాలా భరితమైన రోజులు మిస్ అవుతున్నాను. అలూ.. ఎలా ' అంటూ రాసుకొచ్చాడు. కోహ్లీ చాలా స్ట్రిక్ట్ డైట్ పాటిస్తాడు. తన ఆహారం నుంచి ఆలుగడ్డలు తీసివేయడంతో ఆ బాధను ఇలా షేర్ చేసుకున్నట్లు కనపడుతున్నది.

    కోహ్లీ షేర్ చేసిన ఈ లెటర్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ట్రూ లవ్ అని చెప్పి ఇలా అలూపై కామెడీ పోస్టును పెట్టడం నవ్వులు పూయిస్తున్నది. కనీసం అనుష్కకు అయినా ఇలా ప్రేమను వ్యక్తం చేశాడో లేదో గానీ.. ఆలుగడ్డపై మాత్రం వల్లమాలని ప్రేమ కురిపిస్తున్నాడని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ లెటర్ పెట్టిన తర్వాత 'టూ యమ్మీ చిప్స్' సంబంధించిన యాడ్ పోస్ట్ చేశాడు. అదంతా ఒక కమర్షియల్ యాడ్‌లో భాగంగానే కోహ్లీ చేసినట్లు తెలుసుకొని అభిమానులు నవ్వుకుంటున్నారు.

    కోహ్లీ ట్రూ లవ్ లెటర్











    View this post on Instagram






    A post shared by Virat Kohli (@virat.kohli)








    విరాట్ సేన ప్రస్తుతం సౌతాంప్టన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సిద్దపడుతున్నారు. టీమ్ ఇండియా రెండు జట్లుగా విడిపోయి ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. మరోవైపు న్యూజీలాండ్ జట్టు ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్ గెలిచి ఆత్మ విశ్వాసం మూట గట్టుకున్నది. అయితే కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ గాయపడటం ఆ జట్టును ఆందోళనలో పడేసింది. రెండో టెస్టులో గాయపడటంతో ఆ జట్టు ఓపెనర్ లాథమ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
    Published by:John Naveen Kora
    First published: