• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • KOHLI TOUCHED SACHIN FEET TENDULKAR SERIOUS REACTION WHO TOLD KOHLI TO TOUCH SACHIN FEET JNK

Sachin : సచిన్ కాళ్లు పట్టుకున్న విరాట్ కోహ్లీ.. సచిన్ సీరియస్ రియాక్షన్.. కాళ్లు పట్టుకోమని చెప్పింది ఎవరంటే!

Sachin : సచిన్ కాళ్లు పట్టుకున్న విరాట్ కోహ్లీ.. సచిన్ సీరియస్ రియాక్షన్.. కాళ్లు పట్టుకోమని చెప్పింది ఎవరంటే!

కోహ్లీని ర్యాగింగ్ చేసిన ఆ ముగ్గురు ఎవరో తెలుసా?

టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో సీరియస్ క్రికెట్ డిస్కషన్స్ మాత్రమే కాదు. అప్పుడప్పుడూ సరదాగా జూనియర్లపై ప్రాంక్స్, ర్యాగింగ్స్ కూడా జరుగుతుంటాయి. ఆ రోజు కోహ్లీపై కూడా ఫ్రాంక్ ప్లే చేశారు. ఎవరంటే..

  • Share this:
    కొత్తగా కాలేజీలో చేరేవారికి ఎదురయ్యే సమస్య ర్యాగింగ్. ఇది సరదాగా ఉన్నంత కాలం చాలా ఎంజాయ్ చేయవచ్చు. కానీ మితిమీరితేనే కష్టం. టీమ్ ఇండియాలో (Team India) కూడా ఇలాంటి ర్యాంగింగ్ సమస్య ఉన్నది. కానీ అది అంత తీవ్రమైనది కాదు. ఇప్పుడంటే విరాట్ కోహ్లీ (Virat Kohli) టీమ్ ఇండియా కెప్టెన్ అయ్యాడు. కానీ జట్టులోకి వచ్చిన కొత్తలో అతడు కూడా ర్యాగింగ్ బారిన పడ్డాడంటా. 2008లో విరాట్ కోహ్లీ టీమ్ ఇండియా జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశాడు. అప్పడట్లో సచిన్, యువరాజ్, ఇర్ఫాన్ పఠాన్, మునాఫ్ పటేల్ వంటి సీనియర్లు ఉండేవారు. జట్టులోకి వచ్చిన కొత్తలో మునాఫ్, యువరాజ్, పఠాన్ కలసి కోహ్లీని ప్రాంక్ చేయాలని భావించారు. వెంటనే కోహ్లీ దగ్గరకు వెళ్లి జట్టులోకి కొత్తగా ఎవరైనా వస్తే సచిన్ (Sachin Tendulkar) దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలి. వెళ్లి ఆయన కాళ్లు మొక్కు అని చెప్పారంటా. జూనియర్ అయిన కోహ్లీ వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న సచిన్ దగ్గరకు వెళ్లి కాళ్లు మొక్కాడంటా. దీంతో ఆశ్చర్యపోయిన సచిన్ ఏం జరిగిందని కోహ్లీని ఆరాతీశాడు. మీ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోమని ఆ ముగ్గురు చెప్పారంటూ కోహ్లీ చెప్పాడంటే. వెంటనే సచిన్ సహా అక్కడ ఉన్న అందరూ నవ్వేశారు. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ టెండుల్కర్ ఇటీవల వెల్లడించాడు.

    ఆ వీడియోలో సచిన్ ఆ రోజు జరిగిన ఫన్నీ విషయం గురించి చెప్తూ.. 'డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన కోహ్లీ డైరెక్ట్‌గా నా కాళ్లు మొక్కాడు. నేను షాక్‌కు గురై ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగాను. ఇలాంటివి నాకు నచ్చవు అని కూడా చెప్పాను. అయితే కోహ్లీని లేపి చూడగా పక్కన మునాఫ్, యువీ, పఠాన్ నవ్వుతూ ఉన్నారు. అప్పుడు కోహ్లీనే తనకు మీ నుంచి ఆశీర్వాదం తీసుకోమని చెప్పారు. అందుకే అలా చేశాను' అని చెప్పాడు. వెంటనే నేను కూడా నవ్వాను. నిజంగా టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటి సరదా విషయాలు చాలా చోటు చేసుకుంటుంటాయి. ఇది నిజంగా జట్టులో పాజిటివిటీని నింపుతుంది అని సచిన్ అన్నాడు.

    టీమ్ ఇండియా తరపున 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన సచిన్ టెండుల్కర్ మొత్తం 100 సెంచరీలు చేశాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన విరాట్ కోహ్లీ ఇప్పటికే 70 సెంచరీలు చేశాడు. తన సెంచరీల రికార్డు బద్దలు కొట్టే అర్హత విరాట్ కోహ్లీకే ఉందని గతంలో సచినే స్వయంగా చెప్పడం గమనార్హం. కోహ్లీ గత ఏడాదిన్నరగా సెంచరీ నమోదు చేయలేదు. కానీ టీమ్ ఇండియా కోసం మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. త్వరలో న్యూజీలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్ ఇండియాను నడిపించ బోతున్నాడు.
    Published by:John Naveen Kora
    First published: