• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • KOHLI FORGET THAT HE WON THE TOSS TV VIEWERS GONE MAD WITH HIS WITTY ANSWER JNK

IPL 2021 : పిచ్ మధ్యలో కోహ్లీ కామెడీ.. ఔనా.. నాదేనా? అలవాటులో పొరపాటు బాసూ..!

IPL 2021 : పిచ్ మధ్యలో కోహ్లీ కామెడీ.. ఔనా.. నాదేనా? అలవాటులో పొరపాటు బాసూ..!

ఆటతోనే కాదు.. తన చేష్టలతో కూడా కోహ్లీ అలరిస్తున్నాడు.

  • Share this:
    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) కెప్టెన్ కింగ్ కోహ్లీ (Virat Kohli) మ్యాచ్ జరిగే సమయంలో ఎంత అగ్రెసీవ్‌గా ఉంటాడో.. బయట అంతే హుషారుగా ఉంటాడు. మైదానంలో అతడు చేసే కోపమైన పనులు కూడా నవ్వులు తెప్పిస్తుంటాయి. క్రీడాస్పూర్తికి మారు పేరుగా కోహ్లీని చెప్పుకుంటారు. ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిపించి ఆర్సీబీని నడిపిస్తున్న కోహ్లీ.. ఒక విషయాన్ని మాత్రం ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాడు. ఇటీవల కాలంలో కోహ్లీ ఏ మ్యాచ్‌లోనూ టాస్ గెలవడం లేదు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లలో వరుసగా టాస్‌లు ఓడిపోతూ వస్తున్నాడు. దీంతో టాస్ గెలిచినా కోహ్లీ నమ్మలేక పోతున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ వేయడానికి కోహ్లీతో పాటు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ పిచ్ మధ్యలోకి వచ్చాడు. రిఫరీ శక్తి సింగ్ కాయన్‌ను కోహ్లీకి ఇచ్చి టాస్ వేయమన్నాడు. టాస్ సమయంలో సంజూ శాంసన్ టెయిల్స్ కోరుకున్నాడు. అయితే అది హెడ్స్ పడింది. దీంతో కోహ్లీ టాస్ గెలిచాడు. అయితే ఇక్కడే పెద్ద కామెడీ జరిగింది.

    తాను టాస్ ఓడిపోయానని భావించిన కోహ్లీ.. సంజూను ముందుకు నడిపించి టీవీ కామెంటేటర్ ఇయాన్ బిషప్ ముందుకు తోసాడు. దీంతో ఇయాన్ బిషప్ కూడా కాసేపు తటపటాయించి.. వెనుక ఉన్న కోహ్లీని ఏం ఎంచుకుంటారు అని అడిగాడు. దీంతో తేరుకున్న కోహ్లీ.. ఓహ్.. నేను కదా టాస్ గెలిచింది.. అనుకుంటూ ముందుకు వచ్చి.. 'నేను టాస్‌లు గెలవడం ఎప్పుడో మర్చిపోయాను. అందుకే సంజూను ముందుకు తోసాను.. మేము బౌలింగ్ చేస్తాము' అని కోహ్లీ చెప్పాడు. సంజూ కూడా.. నేనే టాస్ గెల్చానేమో అని అనుకున్నాను అనగా.. ఇయాన్ బిషప్ మాత్రం ఇలా కూడా జరుగుతుందా అంటూ అందరూ కలసి నవ్వుకున్నారు. టాస్ సమయంలో జరిగిన ఈ కామెడీని ఐపీఎల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో పెట్టగా వైరల్ అవుతున్నది.





    గతంలో సంజూ శాంసన్ కూడా ఇలాగే టాస్ సమయంలో చేసిన హంగామా వైరల్ గా మారింది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఆడిన తొలి మ్యాచ్ టాస్ వేసి ఆ కాయిన్ జేబులో వేసుకున్నాడు. ఆ తర్వాత రిఫరీ దాన్ని గుర్తించి.. కాయిన్ అలా తీసుకోవడానికి నిబంధనలు అనుమతించవని చెప్పి కాయిన్ వెనక్కు తీసుకున్నాడు. కాగా,  సంజూ పిచ్ మధ్యలోకి వచ్చిన సమయంలోనే ఇలాంటివి జరుగుతుండటం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఈ రోజు మ్యాచ్ ముందు జరిగిన ఈ కామెడీ అందరినీ నవ్వించింది.
    Published by:John Naveen Kora
    First published:

    అగ్ర కథనాలు