‘సారీ... ఆ విషయంలో అంతా నేనే చేశా...’ కరణ్ జోహార్ ‘కాఫీ’ పశ్చాత్తాపం...

Koffee with Karan Controversy : మహిళల్ని కించపరుస్తూ మాట్లాడి... టీం ఇండియా క్రికెటర్లు పాండ్యా, రాహుల్ అడ్డంగా బుక్కయ్యారు. మరి కరణ్ జోహార్ సంగతేంటి అన్న ప్రశ్నకు ఆయనే స్పందించారు. ఏమన్నారంటే...

Krishna Kumar N | news18-telugu
Updated: January 23, 2019, 5:13 PM IST
‘సారీ... ఆ విషయంలో అంతా నేనే చేశా...’ కరణ్ జోహార్ ‘కాఫీ’ పశ్చాత్తాపం...
కరణ్ జోహార్
Krishna Kumar N | news18-telugu
Updated: January 23, 2019, 5:13 PM IST
కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొని మహిళలపై నోరు జారి... టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ చిక్కుల్లో పడ్డారు. అయితే... వాళ్లు మహిళల్ని కించపరిచేలా మాట్లాడటానికి కారణం ఆ షో నిర్వహించిన కరణ్ జోహారే అన్న వాదన వినిపిస్తోంది. ఆయన తప్పించుకున్నాడు గానీ... వాళ్లిద్దరూ బుక్కైపోయారు అని కొందరు అంటుంటే... కరణ్ జోహార్ ఈ వివాదంపై స్పందించాడు. వాళ్లకు ఆ పరిస్థితి రావడానికి తానే బాధ్యుడినని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ అంశం తన పరిధిలో లేదన్న కరణ్... వివాదం తన షోలో జరిగింది కాబట్టి, వాళ్లను షోకి తనే ఆహ్వానించాడు కాబట్టి... అక్కడ ఏం జరిగినా తనదే బాధ్యత అన్నాడు.

పాండ్యా, రాహుల్‌కి జరిగిన నష్టానికి నేను బాధపడుతున్నాను. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. నా వల్ల జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి అన్న దానిపై ఆలోచిస్తున్నట్లు తెలిపాడు. తన మాట ఎవరూ వినట్లేదన్న కరణ్... ప్రస్తుతం ఏదీ తన కంట్రోల్‌లో లేదన్నాడు.


కాఫీ విత్ కరణ్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌పై సీఓఏ నిరవధికంగా సస్పెండ్ చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌తోపాటు ఇప్పుడు జరుగుతున్న న్యూజిలాండ్ టూర్‌కి కూడా వాళ్లు దూరమయ్యారు. తమ వ్యాఖ్యలపై ఇద్దరూ సారీ చెప్పినా, ఫలితం లేకపోయింది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

 Video : మానవత్వం అంటే ఇదీ.. డ్రైవర్ ప్రాణాలు కాపాడిన ప్రయాణికులు
First published: January 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...