• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • KL RAHUL SUFFERING WITH ACUTE APPENDICITIS WILL MILL REST OF THE SEASON JNK

IPL 2021 : కేఎల్ రాహుల్‌కు సర్జరీ.. మిగతా సీజన్ ఆడేది అనుమానమే?

కేఎల్ రాహుల్‌కు సర్జరీ.. ఐపీఎల్‌కు దూరం? [PC:iplt20.com]

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) ఇప్పుడిప్పుడే విజయాలు సాధిస్తూ ప్లేఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL rahul) తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి హోటల్ రూమ్‌లో అతడు కడుపు నొప్పితో బాధపడుతుండగా ఫ్రాంచైజీ మెడికల్ బృందం అతడిని పరీక్షించి ప్రాథమిక చికిత్స చేసింది. అయితే కడుపు నొప్పి ఎంతకూ తగ్గకుండా మరింత తీవ్రంగా మారడంతో అత్యవసర గదికి తీసుకొని వెళ్లి పరీక్షించారు. అతడు 'అక్యూట్ అపెండీసైటిస్'తో బాధపడుతున్నట్లు నిర్ధారించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాహుల్‌కు వెంటనే శస్త్ర చికిత్స (Surgery) నిర్వహించాల్సి ఉంటుందని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. 'కేఎల్ రాహుల్ కోసం ప్రార్థించండి.. అతడు త్వరగా మెరుగైన ఆరోగ్యం పొందాలి' అని పంజాబ్ కింగ్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నది. కేఎల్ రాహుల్ గౌర్హాజరీలో మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నది. ఈ సీజన్‌లో రాహుల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

    కేఎల్ రాహుల్‌కు అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగితే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది. ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తయిన నేపథ్యంలో అతడు తిరిగి కోలుకొని ఐపీఎల్ ఆడేది అనుమానమే అని తెలుస్తున్నది. కేఎల్ రాహుల్ పూర్తి విశ్రాంతి తీసుకుంటే ఇక ఐపీఎల్ 2021 నుంచి బయటకు వెళ్లాల్సిందేని పంజాబ్ కింగ్స్ వర్గాలు చెబుతున్నాయి. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడి మూడింట విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్నది. మిగిలిన మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శన చేస్తే తప్పకుండా ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉన్నది.





    కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు 331 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్దసెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో కేఎల్ రాహుల్ అత్యధిక స్కోర్ 91. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చెలరేగి ఆడిన రాహుల్.. మరో సారి జట్టుకు విజయం అందించాడు.
    Published by:John Naveen Kora
    First published: