• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • KL RAHUL RECORDS ON ROYAL CHALLENGERS BENGALURU PUNJAB WON 3 CONSECUTIVE MATCHES ON RCB JNK

IPL 2021 : ఆర్సీబీ అనగానే కేఎల్ రాహుల్‌కి పూనకం వస్తుందా? బెంగళూరు, పంజాబ్ మ్యాచ్ రికార్డులు ఇవే

బెంగళూరుపై మరోసారి చెలరేగిన కేఎల్ రాహుల్ [PC: iplt20.com]

  • Share this:
    ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (IPL 2021) కొంత మందికి అలా కలసి వస్తుంటుంది. బ్యాట్స్‌మాన్ అయినా.. బౌలర్ అయినా ఏదో ఒక జట్టుపై చెలరేగి ఆడుతుంటారు. సీజన్ మారినా, వేదిక మారినా ఆ ప్రత్యర్థిపై మాత్రం ప్రతాపం చూపిస్తుంటారు. అలాగే పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు (KL Rahul) రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో (Royal challengers Bengaluru) మ్యాచ్ అనగానే పూనకం వస్తుందనుకుంటా. గత సీజన్‌లో పంజాబ్ పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్‌లో 6వ స్థానంతో సరిపెట్టుకున్నది. అయితే ఆ సీజన్‌లో బెంగళూరుతో జరిగిన రెండు మ్యాచ్‌లు కూడా పంజాబ్ గెలిచింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఆ రెండు మ్యాచ్‌లలో చెలరేగి ఆడాడు. ఒక మ్యాచ్‌లో 69 బంతుల్లో 132 పరుగులు చేయడంతో పంజాబ్ 206 పరుగులు సాధించింది. కానీ ఆర్సీబీ కేవలం 109కే కుప్పకూలింది. అదే సీజన్‌లో రెండో మ్యాచ్‌లో ఆర్సీబీ 172 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. కేఎల్ రాహుల్ మరోసారి చెలరేగి 61 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక తాజాగా అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మరోసారి బెంగళూరు బౌలర్లపై విరుచుకపడ్డాడు. చివరి వరకు నిలబడి 57 బంతుల్లో 91 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ 179 పరుగులు చేసింది. ఆర్సీబీ మరోసారి ఛేజింగ్‌లో తడబడి 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మూడు మ్యాచ్‌లలో కూడా కేఎల్ రాహుల్ నాటౌట్‌గానే నిలిచాడు.

    ఇక ఈ మ్యాచ్‌లో మరికొన్న హైలైట్స్ చూస్తే.. ఏబీ డివిలియర్స్ ఈ సీజన్‌లో మూడు సార్లు అవుటయ్యాడు. ఆ మూడు సందర్భాల్లో స్పిన్ బౌలింగ్‌లోనే అవుట్ కావడం విశేషం. మరోవైపు పంజాబ్ తాజా సంచలనం హర్‌ప్రీత్ బ్రార్ ఐపీఎల్‌లో తీసిన తొలి వికెట్ విరాట్ కోహ్లీది కావడం గమనార్హం. ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ వికెట్ తమ తొలి వికెట్ అయిన బౌలర్లు 8 మంది ఉన్నారు. అశోక్ దిండా, ఆశిష్ నెహ్రా, ఆల్బీ మోర్కెల్, చేతన్య నంద, డో బ్రాస్‌వెల్, మిచెల్ మెక్లింగన్, జస్ప్రిత్ బుమ్రా. వీరి సరసన తాజాగా బ్రార్ నిలిచాడు. ఇక ఇదే మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ నికొలస్ పూర్ డకౌట్ అయ్యాడు. ఈ సీజన్‌లో పూరన్‌కు 4వ డకౌట్ ఇది. గతంలో ఓకే సీజన్‌లో నాలుగు సార్లు డకౌట్ అయిన క్రికెటర్లు.. హర్ష్‌లే గిబ్స్ (2009), మిథున్ మన్హాస్ (2011), మనీష్ పాండే (2012), శిఖర్ ధావన్ (2020) ఉన్నారు.





    కాగా, ఈ మ్యాచ్ విజయంతో పంజాబ్ కింగ్స్ రన్‌రేట్ మెరుగుపర్చుకోవడమే కాకుండా పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానానికి చేరుకున్నది. మరోవైపు కేఎల్ రాహుల్ ఈ సీజన్‌లో 331 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.
    Published by:John Naveen Kora
    First published: