న్యూజీలాండ్‌తో (New Zealand) జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో (Test Series) తొలి మ్యాచ్ నవంబర్ 25 నుంచి కాన్పూర్‌లో ప్రారంభం కానున్నది. మ్యాచ్ ప్రారంభానికి మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో భారత జట్టుకు (Team India) పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul) గాయం కారణంగా టెస్టు జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో ఎడమ తొంటికి గాయం అయ్యింది. దీంతో అతడు న్యూజీలాండ్‌తో జరుగనున్న టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో ఉండడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అతడు వెంటనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ఏసీ)లో (NAC) రిపోర్టు చేయనున్నాడు. అక్కడ రీహాబిలిటేషన్ ద్వారా గాయం నుంచి కోలుకొని ఫిట్‌నెస్ సాధిస్తే.. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనకు పరిగణలోకి తీసుకోనున్నట్లు బీసీసీఐ చెప్పింది. ఇప్పటికే హార్దిక్ పాండ్యాను కూడా ఎన్ఏసీలో రిపోర్టు చేయాలని బీసీసీఐ కోరిన విషయం తెలిసిందే.
కేఎల్ రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను (Suryakumar Yadav) టెస్టు జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. వర్చువల్ విధానంలో సమావేశం అయిన సీనియర్ టీమ్ ఇండియా సెలెక్టర్లు ఆ మేరకు యాదవ్‌ను ఎంపిక చేశారు. ముంబైకి చెందిన సూర్యకుమార్ యాదవ్ గత రెండు సీజన్లుగా ఐపీఎల్‌లో చక్కని ప్రతిభ కనపరిచాడు. ఐపీఎల్‌లో అతడి నిలకడైన బ్యాటింగ్ జాతీయ జట్టులో స్థానం కల్పించేలా చేసింది. ఈ ఏడాది మార్చిలో ఇంగ్లాండ్‌పై టీ20ల్లో, జులైలో శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో కూడా సూర్యకుమార్ మంచి ఫామ్‌లో కనపడ్డాడు. ఒక టీ20లో జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలిచాడు. 2010 నుంచి ముంబై రంజీ జట్టు తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 77 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 39.68 సగటుతో 5326 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 20 అర్దసెంచరీలు ఉన్నాయి. ముంబై రంజీ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఇక ఐపీఎల్‌లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు.
NEWS - Suryakumar Yadav replaces KL Rahul in India's Test squad.
KL Rahul has sustained a muscle strain on his left thigh and has been ruled out of the upcoming 2-match Paytm Test series against New Zealand.
More details here -https://t.co/ChXVhBSb6H #INDvNZ @Paytm pic.twitter.com/uZp21Ybajx
— BCCI (@BCCI) November 23, 2021
ఇండియా తొలి టెస్టు జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజార (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వృద్దిమాన్ సాహ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్. ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs newzealand, KL Rahul, Team India, Test Cricket