KL RAHUL NAMED INDIA VICE CAPTAIN FOR TEST SERIES AGAINST SOUTH AFRICA JNK
IND vs SA: ఇండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. త్వరలో ప్రకటించే అవకాశం
టీమ్ ఇండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. త్వరలో ప్రకటన (PC: BCCI)
IND vs SA: దక్షిణాఫ్రికాతో జరిగే 3 టెస్టుల సిరీస్‌కు కేఎల్ రాహుల్ భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉన్నది. రోహిత్ శర్మ గైర్హాజరీలో ఈ బాధ్యతను టీ20 వైస్ కెప్టెన్ రాహుల్‌కు అప్పగించనున్నారు. గాయం కారణంగా ఈ టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరమయ్యాడు.
దక్షిణాఫ్రికాతో (India vs South Africa) జరుగనున్న 3 టెస్టుల సిరీస్‌కు (Test Series)వైస్ కెప్టెన్‌గా (Vice Captain)కేఎల్ రాహుల్‌కు (KL Rahul) బాధ్యతలు అప్పగించారు. టెస్టు జట్టును ప్రకటించే సమయంలో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ (Virat Kohli), వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను (Rohit Sharma) నియమించారు. అయితే రోహిత్ దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు ముంబైలో ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు, దీంతో రోహిత్ టెస్టు సిరీస్‌కు దూరమై ప్రస్తుతం ఎన్ఏసీలో గాయం నుంచి కోలుకుంటున్నాడు. తాజాగా ఏఎన్ఐ రిపోర్టు ప్రకారం.. రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన దగ్గర నుంచి ఎక్కువ మ్యాచ్‌లకు అజింక్య రహానే వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా అజింక్య రహానేను ఎంపిక చేసినా.. రోహిత్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. అయితే రోహిత్ గైర్హాజరీలో తిరిగి అజింక్యకు వైస్ కెప్టెన్సీ ఇస్తారని భావించినా.. కేఎల్ రాహుల్‌కు ఆ బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే టీ20 వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
తొడ కండరాల గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ దూరమైనట్లు బీసీసీఐ సోమవారం స్పష్టం చేసింది. అతని స్థానంలో ప్రియాంక్ పంచల్‌ను టెస్టు జట్టులోకి తీసుకున్నారు. 3 టెస్టులు, 3 వన్డేల కోసం డిసెంబర్ 16న దక్షిణాఫ్రికా చేరుకున్న భారత జట్టు ఇప్పుడు ప్రాక్టీస్ కూడా ప్రారంభించింది. ఇరు జట్ల మధ్య మధ్య తొలి టెస్టు డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా జరగనుంది.
దక్షిణాఫ్రికా టూర్‌కు బయలుదేరే ముందు.. రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్‌తో కలిసి మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేస్తాడని భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. మయాంక్ అగర్వాల్ ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో సెంచరీ చేయడం ద్వారా తనను తాను నిరూపించుకున్నాడు. దీంతో భారత జట్టు 1-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.