• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • KL RAHUL MAY BREAK THESE RECORDS IN THIS SEASON WHAT RAHUL DID IN LAST SEASON JNK

IPL 2021 : ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ రికార్డులు తెలుసా? ఈ సారి రాణిస్తే ఈ రికార్డులు రాహుల్ సొంతం

IPL 2021 : ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ రికార్డులు తెలుసా? ఈ సారి రాణిస్తే ఈ రికార్డులు రాహుల్ సొంతం

కొత్త రికార్డులపై కన్నేసిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (File Photo)

  • Share this:
    ఐపీఎల్ (IPL 2021) మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నది. ధనాధన్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. శుక్రవారం సాయంత్రం చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్(Mumbai Indians), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) మధ్య తొలి మ్యాచ్ జరుగనున్నది. అయితే ఈ సారి ఏయే బ్యాట్స్‌మెన్ రాణిస్తారు.. ఎవరు రికార్డులు కొల్లగొడతారని అందరిలో ఆసక్తి నెలకొన్నది. ముఖ్యంగా గత ఏడాది అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై (KL Rahul) అందరి దృష్టి ఉన్నది. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో సెంచరీ కొట్టి ఫామ్‌లోకి వచ్చిన రాహుల్.. మరో సారి పరుగుల వరద పారిస్తాడా అని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. గత మూడు సీజన్లలో వరుసగా 500 పరుగులు దాటిన క్రికెటర్‌గా రాహుల్ రికార్డు సృష్టించాడు 2018లో 659 పరుగులు, 2019లో 593 పరుగులు చేసిన రాహుల్.. 2020లో 670 పరుగులతో చెలరేగిపోయాడు. ఈ సారి కూడా మరిన్న పరుగులు చేసి పంజాబ్ కింగ్స్‌ను విజేతగా నిలుపుతాడో లేదో చూడాలి.

    గత సీజన్‌లో కేఎల్ రాహుల్..

    - గత మూడు సీజన్లలో అత్యధిక పరుగులు చేసిన టాప్-3లో కేఎల్ రాహుల్ ఉన్నాడు.
    - ఐపీఎల్ 2020లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 132 పరుగులు చేశాడు. అతడికి ఇదే అత్యధిక స్కోర్.
    - ముంబై ఇండియన్స్‌పై 12 ఇన్నింగ్స్‌లో ఐదు అర్ద సెంచరీలు, ఒక సెంచరీ నమోదు చేశాడు. అన్ని ఫ్రాంచైజీల కంటే ముంబై పైనే రాహుల్ అత్యధిక పరుగులు చేశాడు.
    - ముంబై జట్టుపై రాహుల్ సగటు 64.44గా ఉన్నది.

    ఈ సీజన్‌లో రాహుల్ ఏయే రికార్డులు చేరుకోవచ్చు

    - కేఎల్ రాహుల్ మరో 78 పరుగులు చేస్తే పంజాబ్ కింగ్స్ తరపున 2000 పరుగుల మైలు రాయిని అందుకోవచ్చు. షాన్ మార్ష్ తర్వాత ఈ రికార్డును అందుకున్న క్రికెటర్‌గా రాహుల్ రికార్డులకు ఎక్కనున్నాడు.
    - పంజాబ్ కింగ్స్ తర్వాత అత్యధిక అర్ద సెంచరీలు షాన్ మార్ష్ (21) తరపున ఉన్నాయి. రాహుల్ మరో 3 సెంచరీలు చేస్తే ఈ మార్కును అందుకోవచ్చు.
    - పంజాబ్ కింగ్స్ తరపున ఇప్పటి వరకు 80 సిక్సులు కొట్టాడు. మరో 20 సిక్సులు కొడితే రాహుల్ సిక్సుల సెంచరీ చేస్తాడు.
    - మరో 158 పరుగులు చేస్తే కేఎల్ రాహుల్ టీ20ల్లో 5 వేల పరుగుల మార్కును అందుకుంటాడు.
    - మరో 8 సిక్సులు కొడితే టీ20ల్లో 200 సిక్సుల మార్కు అందుకుంటాడు.
    Published by:John Naveen Kora
    First published:

    అగ్ర కథనాలు