హోమ్ /వార్తలు /క్రీడలు /

KL Rahul: లక్నో జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. పంజాబ్ కింగ్స్ నుంచి వెళ్లిపోతున్న స్టార్ బ్యాటర్.. భారీ ధర చెల్లించబోతున్న గోయెంకా

KL Rahul: లక్నో జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. పంజాబ్ కింగ్స్ నుంచి వెళ్లిపోతున్న స్టార్ బ్యాటర్.. భారీ ధర చెల్లించబోతున్న గోయెంకా

కేఎల్ రాహుల్

కేఎల్ రాహుల్

KL Rahul: టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా రాబోయే సీజన్‌లో తాను పంజాబ్‌కు ఆడనని అతడు స్పష్టం చేశాడు. కొత్తగా వచ్చిన లక్నో జట్టు యాజమాన్యం అతడితో మూడేళ్లకు గాను భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తున్నది.

ఇంకా చదవండి ...

ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్‌కు సంబంధించి వచ్చే ఏడాది జనవరిలో మెగా వేలం (Mega Auction) నిర్వహించబోతున్నారు. 14 ఏళ్ల తర్వాత తొలి సారి బీసీసీఐ (BCCI) భారీ వేలానికి తెరతీసింది. దీనికి సంబంధించి ఇప్పటికే బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు ప్లేయర్ రిటెన్షన్ పాలసీని (Player Retention Policy) తెలియజేసింది. ప్లేయర్స్ రిటెన్షన్ పాలసీ ప్రకారం ప్రస్తుతం ఉన్న టీమ్స్ గరిష్టంగా నలుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నది. ఇక మెగా వేలంలో పాల్గొనడానికి అన్ని జట్ల వద్ద రూ. 90 కోట్ల పర్స్ వాల్యూ ఉంటుంది. అయితే రిటైన్ చేసుకునే ప్లేయర్లను బట్టి పర్స్ నుంచి డబ్బులు కట్ అవుతుంటాయి. ఇక ఒక్కో జట్టు గరిష్టంగా నలుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోవచ్చు. ఇందులో గరిష్టంగా ముగ్గురు భారతీయులు ఉండొచ్చు. ఒక వేళ అన్ క్యాప్ట్ ప్లేయర్స్ అయితే గరిష్టంగా ఇద్దరికే చాన్స్ ఉంటుంది. ఇక విదేశీ ప్లేయర్లు అయితే గరిష్టంగా ఇద్దరికి మాత్రమే చాన్స్ ఉంటుంది. ఈ కాంబినేషన్ల ఆధారంగా గరిష్టంగా నలుగురికి రిటెన్షన్ మించకూడదు. అయితే ఎవరైనా ప్లేయర్‌ను రిటెన్షన్ చేసుకోవాలంటే తప్పకుండా ఆటగాడి అనుమతి తప్పనిసరి. ఒక వేళ ఆటగాడు తాను జట్టుతో పాటు కొనసాగలేను అని చెబితే.. అతడిని విడుదల చేయాల్సి ఉంటుంది.

ఐపీఎల్ 2021 సీజన్‌లో మంచి స్టార్ట్ చేసినా.. ఆఖరికి పేలవ ప్రదర్శన చేసిన కింగ్స్ పంజాబ్ నుంచి ఈ సారి తప్పుకుంటున్నట్లు కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) ప్రకటించాడు. బ్యాటర్‌గా అతడు విజయవంతం అయినా.. కెప్టెన్‌గా మాత్రం జట్టును విజయాల బాట పట్టించలేక పోయాడు. దీంతో ఈ సారి తాను పంజాబ్ కింగ్స్ తరపున ఆడబోవడం లేదని.. తాను జట్టుకు వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పాడు. బెంగళూరుకు చెందిన కేఎల్ రాహుల్ సొంత నగరానికి చెందిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వెళ్తాడని అందరూ భావించారు. ప్రస్తుతం ఆ జట్టుకు కెప్టెన్ అవసరం కూడా ఉన్నది. అయితే అనూహ్యంగా కొత్తగా లీగ్‌లో చేరిన లక్నో జట్టు అతడిని కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తున్నది.

IND vs NZ: తడబడి నిలిచిన భారత్.. శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ.. తొలి సెషన్ ఇండియాదే.. భారీ స్కోర్ సాధిస్తుందా?


ఆర్పీ సంజీవ్ గోయాంకా గ్రూప్ ఇటీవల లక్నో ఫ్రాంచైజీని రికార్డు స్థాయిలో రూ. 7090 కోట్లకు సొంతం చేసుకున్నది. ఇంకా పేరు పెట్టని ఈ లక్నో ఫ్రాంచైజీ ఇప్పటికే కేఎల్ రాహుల్‌లో చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. భారీ మొత్తానికి కేఎల్ రాహుల్‌తో రాబోయే మూడు సీజన్లకు గాను డీల్ కుదిరినట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. లక్నో జట్టుకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌నే నియమించాలని సంజీవ్ గోయెంకా కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తున్నది. కేఎల్ రాహుల్‌ను తీసుకోవడానికి కూడా ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్‌కు ఎలాంటి అడ్డంకులు కూడా ఉండబోవు.


తాను పంజాబ్ కింగ్స్‌ను వీడనున్నట్లు ఇప్పటికే కేఎల్ రాహుల్ స్పష్టం చేయడంతో ఆ ఫ్రాంచైజీ అతడిని రిటైన్ చేసుకోదు. దీంతో అతడు వేలం పాటలోకి వస్తాడు. అయితే మెగా వేలం కంటే ముందే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 30 వరకు కొత్త జట్లకు 'ఫ్రీ పిక్' అనే ఆప్షన్‌ను బీసీసీఐ ఇచ్చింది. దీని ప్రకారం రిటైన్ కాని ఎవరైనా ముగ్గురు క్రికెటర్లను మెగా ఆక్షన్ కంటే ముందే తమ జట్టులోకి తీసుకోవచ్చు. అధిక ధర పెట్టి ఫ్రాంచైజీని సొంత చేసుకున్న లక్నోకే ఈ ఆప్షన్‌లో మొదటి అవకాశం వస్తుంది. దీంతో అహ్మదాబాద్ కంటే ముందు లక్నో యాజమాన్యానికి ఆటగాళ్లను ఫ్రీ పిక్ చేసుకునే అవకాశం ఉన్నది. దీన్ని ఉపయోగించుకునే కేఎల్ రాహుల్‌ను లక్నో జట్టు తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అతడికి రూ. 16 కోట్ల వరకు చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

MS Dhoni Retention: ఇప్పట్లో రిటైర్మెంట్ లేదు.. ధోనీని ఏకంగా మూడేళ్ల పాటు రిటైన్ చేసుకోనున్న సీఎస్కే.. లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..!


 కేఎల్ రాహుల్ గత నాలుగు సీజన్లుగా బ్యాటుతో విశేషంగా రాణిస్తున్నాడు. అతడు ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్న ఆటగాడు. గత నాలుగు సీజన్లలో ప్రతీ సారి 550 పరుగుల కంటే ఎక్కువ సాధించాడు. అంతే కాకుండా అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. వికెట్ కీపర్‌గా సేవలు అందించగల కేఎల్ రాహుల్.. ప్రస్తుతం టీమ్ ఇండియా టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు.

First published:

Tags: Bcci, IPL 2022, KL Rahul, Lucknow, Punjab kings

ఉత్తమ కథలు