కేఎల్ రాహుల్, పాండ్యాకు భారీ ఫైన్.. డబ్బులు కట్టకపోతే...

ఒకవేళ వారిద్దరూ నాలుగు వారాల్లో తాము విధించిన జరిమానాను కట్టకపోతే వారి మ్యాచ్ ఫీజులో నుంచి కోత విధించి వసూలు చేస్తామని స్పష్టం చేసింది.

news18-telugu
Updated: April 20, 2019, 12:52 PM IST
కేఎల్ రాహుల్, పాండ్యాకు భారీ ఫైన్.. డబ్బులు కట్టకపోతే...
కాఫీ విత్ కరణ్ షోలో హార్థిక్ పాండ్య, కేఎల్ రాహుల్
news18-telugu
Updated: April 20, 2019, 12:52 PM IST
కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌లో నోరుజారిన క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలకు బీసీసీఐ అంబుడ్స్‌మన్ భారీ జరిమానా విధించింది. చెరో రూ.2లక్షల ఫైన్ వేసింది. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన పది మంది పారామిలటరీ సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1లక్ష చొప్పున పది మందికి వారిద్దరూ ఇవ్వాలని చెప్పింది. అలాగే, మిగిలిన రూ.10లక్షలను అంథుల క్రికెట్ పురోభివృద్ది కోసం డొనేట్ చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు నియమించిన బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ వారిద్దరూ నాలుగు వారాల్లో తాము విధించిన జరిమానాను కట్టకపోతే వారి మ్యాచ్ ఫీజులో నుంచి కోత విధించి వసూలు చేస్తామని స్పష్టం చేసింది. దేశంలో క్రికెటర్లను చాలా మంది రోల్ మొడల్‌గా తీసుకుంటారని, అలాంటి వారు నోరుజారడం మంచిది కాదని హితవు పలికింది. బీసీసీఐ ఆటగాళ్లకు విధించిన నియమ నిబంధనలను వారు ఉల్లంఘించారని అంబుడ్స్‌మన్ స్పష్టం చేశారు. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఇద్దరూ వరల్డ్ కప్ జట్టుకు సెలక్ట్ అయ్యారు.

First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...