Home /News /sports /

KL RAHUL FINED FOR SHOWING DISSENT TOWARDS THE UMPIRES IN 4TH TEST OF DAY 4 15 PERCENT OF MATCH FEE WILL BE SLASHED JNK

KL Rahul Fined: టీమ్ ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు జరిమానా.. 3వ రోజు ఆటలో ఏం జరిగింది?

కేఎల్ రాహుల్‌కు జరిమానా విధించిన ఐసీసీ (PC: England Cricket)

కేఎల్ రాహుల్‌కు జరిమానా విధించిన ఐసీసీ (PC: England Cricket)

KL Rahul Fined: టీమ్ ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మాన్ కేఎల్ రాహుల్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పడింది. ఓవల్‌ వేదికగా ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 4వ టెస్టు మూడో రోజు అంపైర్ల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో అతడికి జరిమానా విధించారు.

ఇంకా చదవండి ...
    టీమ్ ఇండియా (Team India) ఓపెనింగ్ బ్యాట్స్‌మాన్ కేఎల్ రాహుల్‌కు (KL Rahul) మ్యాచ్ అఫీషియల్స్ జరిమానా విధించారు. అంపైర్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసంతృప్తి వ్యక్తం చేసినందుకు గాను అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ (ICC) మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ పేర్కొన్నారు. ఓవల్‌లో (The Oval) జరుగుతున్న నాలుగో టెస్టు (4th Test) 3వ రోజున కేఎల్ రాహుల్ అవుటైన తర్వాత అతడు అంపైర్ల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమ్ ఇండియా (Team India) రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా జేమ్స్ అండర్సన్ (James Anderson) వేసిన 34వ ఓవర్‌లో బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి కీపర్ చేతికి చిక్కింది. అయితే ఆన్‌ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో ఇంగ్లాండ్ జట్టు డీఆర్ఎస్ తీసుకున్నది. అయితే టీవీ అంపైర్ బంతి బ్యాట్‌కు తగిలినట్లు నమ్మి కేఎల్ రాహుల్‌ను అవుట్ అని ప్రకటించాడు. కానీ కేఎల్ రాహుల్ తాను నాటౌట్ అని.. అంపైర్ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేశాడు. బ్యాట్ తన ప్యాడ్‌కు తాకడం వల్లే సౌండ్ వచ్చిందని.. అసలు బంతి తన బ్యాట్‌కు తగల్లేదని చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

    3వ రోజు ఆట ముగిసిన అనంతరం కేఎల్ రాహుల్ విషయాన్ని ఆన్ ఫీల్డ్ అంపైర్లు అలెక్స్ వార్ఫ్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ మ్యాచ్ రిఫరీకి పిర్యాదు చేశారు. ఇద్దరు ఆన్ ఫీల్డ్ అంపైర్లు, టీవీ అంపైర్ మైఖెల్ గాఫ్, రిఫరీ క్రిస్ బ్రాడ్ కలసి కేఎల్ రాహుల్ ఘటనపై విచారణ జరిపారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ 2.8 ప్రకారం కేఎల్ రాహుల్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేల్చారు. అంతర్జాతీయ మ్యాచ్‌లో అఫీషియల్స్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం నేరం కిందకు వస్తుంది. కేఎల్ రాహుల్ గత 24 నెలల్లో నిబంధనలు ఉల్లంఘించడం ఇదే తొలిసారి. దీంతో అతడిపై కేవలం 15 శాతం మ్యాచ్ ఫీజ్ జరిమాన మాత్రమే విధించారు. అంతే కాకుండా కేఎల్ రాహుల్ తన తప్పును ఒప్పుకోవడంతో ఒక అనధికార విచారణ మాత్రమే ఉంటుందని మ్యాచ్ రిఫరీ బ్రాడ్ పేర్కొన్నారు.

    Suresh Raina: సురేష్ రైనా కెప్టెన్సీలో అరంగేట్రం చేసిన క్రికెటర్లు తెలుసా? ఈ లిస్టులో పేర్లు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు



     99 పరుగుల వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టును ఓపెనర్లు ఆదుకున్నారు. భారత జట్టు 3వ రోజు 171 పరుగుల ఆధిక్యత సాధించడంలో కేఎల్ రాహుల్ (46) ఇన్నింగ్స్ కూడా ఉపయోగపడింది. ఈ సిరీస్‌లో భారత తరపున రెండు సెంచరీలు నమోదు కాగా.. అందులో ఒకటి కేఎల్ రాహుల్ చేయడం గమనార్హం. లార్డ్స్ మైదానంలో దిగ్గజాలకు కూడా సాధ్యం కాని సెంచరీ చేశాడు. నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే అవుటైనా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిలకడగా ఆడాడు. రోహిత్ శర్మతో కలసి కేఎల్ రాహుల్ తొలి వికెట్‌కు 83 పరుగులు చేశాడు.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Cricket, ICC, India vs england, KL Rahul

    తదుపరి వార్తలు