హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021 : తెవాతియాకు కేఎల్ రాహుల్ అభిమానుల వార్నింగ్.. మా రాహుల్ క్యాచ్ పడతావా?

IPL 2021 : తెవాతియాకు కేఎల్ రాహుల్ అభిమానుల వార్నింగ్.. మా రాహుల్ క్యాచ్ పడతావా?

పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన మ్యాచ్‌లో మరోసారి తన బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించాడు. ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోశాడు. బౌండరీలు సిక్సులతో వాంఖడేను మోతమోగించాడు. ఈ క్రమంలో రాహుల్ సెంచరీ చేస్తాడని అందరూ భావించారు. అయితే చేతన్ సకారియా వేసిన 19వ ఓవర్‌లో రాహుల్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. రాహుల్ తెవాతియా (Rahul Tewatia) అద్బుతంగా బౌండరీ లైన్ వద్ద క్యాచ్ చేశాడు. దీంతో కేఎల్ రాహుల్ 91 పరుగులకే వెనుదిరగాల్సి వచ్చింది. అయితే రాహుల్ సెంచరీ ఆశలకు మరో రాహుల్ (తెవాతియా) గండికొట్టడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. రాహుల్ తెవాతియాకు వాళ్లు స్వీట్ వార్నింగ్స్ పంపుతున్నారు. 'మావాడి సెంచరీ అడ్డుకున్నావ్ కదా.. చూసుకుందాం', 'ఇంకో మ్యాచ్ ఉందిగా.. అప్పుడు బౌలింగ్ చెయ్.. నీ బంతులకు బౌండరీలు దాటించకుంటే అడుగు' అంటూ స్వీట్ ట్రోల్స్ చేస్తున్నారు. కొంత మంది ఫ్యాన్స్ సీరియస్‌గానే వార్నింగ్స్ ఇస్తున్నారు.

కాగా, కేఎల్ రాహుల్ కొట్టిన షాట్‌ను బౌండరీ వద్ద అందుకొని బంతికి గాల్లోకి విసిరి.. బౌండరీ లైన్ దాటి అవతలకు వెళ్లి.. మళ్లీ ఇవతలకు వచ్చి క్యాచ్ అందుకున్నాడు. ఆ క్లిష్టమైన క్యాచ్‌ను టీవీ రీప్లేలో మరోసారి చెక్ చేసిన తర్వాతే అవుట్ ఇచ్చారు. రాహుల్ కోసం ఇంత కష్టపడ్డ తెవాతియా.. గేల్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను మాత్రం నేలపాలు చేశాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో గేల్ ఇచ్చిన క్యాచ్‌ను తెవాతియా వదిలేసిన తర్వాత యూనివర్సల్ బాస్ మరింతగా రెచ్చిపోయి ఆడాడు. ఇక కేఎల్ రాహుల్ 15 పరుగుల వద్ద ఉన్న సమయంలో ఇచ్చిన క్యాచ్‌ను బెన్‌స్టోక్స్ వదిలేసాడు. దీపక్ హుడా ఇచ్చిన క్యాచ్‌ను జాస్ బట్లర్ వదిలేశాడు. ఇలా పలు క్యాచ్‌లు వదిలేయడంతో రాజస్థాన్ రాయల్స్ భారీ మూల్యమే చెల్లించుకున్నది. వాళ్లు ముగ్గురూ చెలరేగి ఆడటంతోనే పంజాబ్ కింగ్స్ 221 పరుగులు చేయగలిగింది.


ఇక రాజస్థాన్ బౌలింగ్ వేసే సమయంలో యువ క్రికెటర్ అద్బుతమైన క్యాచ్ అందుకున్నాడు. ప్రమాదకరమైన నికొలస్ పూరన్ ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న చేతన్ సకారియా అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు. సకారియా ఫీల్డింగ్‌కు అందరూ ఆశ్చర్యపోయిరు.

First published:

Tags: IPL 2021, KL Rahul, Punjab kings, Rajasthan Royals

ఉత్తమ కథలు