Home /News /sports /

KL RAHUL DIDNOT LOOK T20I BATSMAN IN EARLY DAYS VIRAT KOHLI MADE SOME INTERESTING COMMENTS ON LSG SKIPPER SRD

Virat Kohli : " రాహుల్ అస్సలు టీ20 బ్యాటర్ లా కన్పించలేదు.." కోహ్లీ షాకింగ్ కామెంట్స్..

Virat Kohli - KL Rahul

Virat Kohli - KL Rahul

ఐపీఎల్ లో రాహుల్ తొలిసారిగా 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండేళ్ల పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడాడు. మళ్లీ 2016లో ఆర్సీబీ గూటికి వచ్చాడు. తర్వాత పంజాబ్ కు ఆడిన రాహుల్.. ఇప్పుడు లక్నో సూపర్ జెయంట్స్ టీమ్ కు సారథిగా ఉన్నాడు.

ఇంకా చదవండి ...
    రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని టీమిండియా (Team India) సొంతగడ్డపై దుమ్మురేపుతోంది. అయితే, లంక సిరీస్ కు విరాట్ కోహ్లీ (Virat Kohli)కి విశ్రాంతి ఇచ్చింది. అలాగే, కేఎల్ రాహుల్ (KL Rahul) గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అయితే, లేటెస్ట్ గా కేఎల్ రాహుల్ పై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) నిర్వహించిన పాడ్ క్యాస్ట్ లో కేఎల్ రాహుల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కె.ఎల్. రాహుల్ తో మొదట తాను కనెక్ట్ కాలేకపోయానని మాజీ సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. అలాగే.. కెరీర్ ఆరంభంలో రాహుల్ టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ లా కనిపించలేదన్నాడు. 2014 ఆస్ట్రేలియా పర్యటనలోనే అతని సామర్థ్యం తెలిసిందని విరాట్ చెప్పుకొచ్చాడు. రాహుల్‌ 2013లో ఆర్‌సీబీ జట్టు తరఫునే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాతి రెండేళ్లు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడాడు. తిరిగి 2016లో బెంగళూరు గూటికే చేరిన అతను ఆ సీజన్‌లో 397 పరుగులతో రాణించాడు.

    ఐపీఎల్ లో రాహుల్ తొలిసారిగా 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండేళ్ల పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడాడు. మళ్లీ 2016లో ఆర్సీబీ గూటికి వచ్చాడు. తర్వాత పంజాబ్ కు ఆడిన రాహుల్.. ఇప్పుడు లక్నో సూపర్ జెయంట్స్ టీమ్ కు సారథిగా ఉన్నాడు.

    ఈ క్రమంలో కేఎల్ రాహుల్ ఐపీఎల్ జర్నీ పట్ల విరాట్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. "కరణ్‌ నాయర్‌, మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి రాహుల్‌ 2013లో బెంగళూరు జట్టులోనే ఆడాడు. అయితే, అప్పుడు అతను టీ20 బ్యాట్స్‌మన్‌లా అస్సలు కనిపించలేదు. ఇక అతను ఆర్‌సీబీ జట్టును వీడాక నేను పట్టించుకోలేదు. కానీ, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మాత్రం అదరగొడుతున్నాడనే విషయాలు తెలుసుకున్నా.

    ఇది కూడా చదవండి :  సచిన్ పెద్ద మనసు.. చిన్ని ప్రాణాన్ని కాపాడిన క్రికెట్ గాడ్.. వైరల్ వీడియో..

    మా జట్టులో ఆడినప్పుడు యువకుడిలా ఉండేవాడు. మేం ఇద్దరం కలిసి ఎన్ని మ్యాచ్‌లు ఆడినా పెద్దగా కనెక్ట్‌ కాలేకపోయాం. ఇక 2014లో అతను ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా తరఫున టెస్టు అరంగేట్రం చేసినప్పుడు మాత్రం బాగా ఆకట్టుకున్నాడు. ఆటపై దృష్టిసారించి ఎంతో మెరుగ్గా తిరిగొచ్చాడు. దీంతో కంగారూల గడ్డపై మంచి ప్రదర్శన చేశాడు. అప్పుడే అతని ఆత్మస్థైర్యం చూసి ముచ్చటేసింది." అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

    గత రెండు సీజన్లు పంజాబ్ కింగ్స్ సారథిగా కొనసాగిన కేఎల్ రాహుల్.. మెగా వేలానికి ముందు ఆ జట్టును వీడి కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్‌తో జత కట్టాడు. ఆ జట్టు కెప్టెన్‌గా ఐపీఎల్ 2022 సీజన్‌లో బరిలోకి దిగనున్నాడు. కెప్టెన్‌గా జట్టుకు విజయాలందించలేకపోయినా.. వ్యక్తిగతంగా మాత్రం రాహుల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. గత రెండు సీజన్లుగా టాప్ 5 బ్యాటర్లలో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం టీమిండియాలో కీలక బ్యాటర్ గా ఎదిగాడు కేఎల్ రాహుల్.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: IPL 2022, KL Rahul, Royal Challengers Bangalore, Team India, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు