బాలివుడ్ భామతో కేఎల్ రాహుల్ చెట్టాపట్టాల్...కాదంటూనే ఔనంటూ సిగ్నల్స్...

ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ను ఆకాంక్ష గురించి అడగ్గానే అది తన వ్యక్తిగత విషయమని, అనవసరంగా మీడియా సంస్థలు రాద్ధాంతం చేస్తున్నాయని రాహుల్ వాపోయాడు.

news18-telugu
Updated: August 19, 2019, 7:55 PM IST
బాలివుడ్ భామతో కేఎల్ రాహుల్ చెట్టాపట్టాల్...కాదంటూనే ఔనంటూ సిగ్నల్స్...
కేఎల్ రాహుల్‌తో ఆకాంక్ష (Image: Twitter)
  • Share this:
బాలివుడ్ భామ ఆకాంక్ష రంజన్ కపూర్‌తో టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రేమ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ను ఆకాంక్ష గురించి అడగ్గానే అది తన వ్యక్తిగత విషయమని, అనవసరంగా మీడియా సంస్థలు రాద్ధాంతం చేస్తున్నాయని రాహుల్ వాపోయాడు. అంతేకాదు పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేందుకు ఇష్టపడనని, పబ్లిక్‌లో ప్రైవేట్ విషయాలు చర్చించనని రాహుల్ దాటవేశాడు. తాను ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నానో తెలీదని, కెరీర్ పాడయ్యేలా చేయవద్దని రాహుల్ మీడియాను కోరాడు.

అయితే కేఎల్ రాహుల్‌తో ఆకాంక్ష కపూర్ మధ్య ప్రేమబంధం గట్టిగా పెనవేసుకుందని, అటు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆకాంక్ష రంజన్ కపూర్‌తో తన రిలేషన్ ను ఖరాఖండీగా ఖండించకుండా నానవేసేలా మాట్లాడటంతో ఇద్దరి మధ్య ఏదో ఉందనే గుసగుసకు బలం చేకూరుతోంది.

First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు