KKR Vs MI: ఆ మూడు తప్పిదాలే కోల్‌కతా కొంప ముంచాయి


Updated: September 24, 2020, 5:03 PM IST
KKR Vs MI: ఆ మూడు తప్పిదాలే  కోల్‌కతా కొంప ముంచాయి
  • Share this:


బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా టీం దారుణంగా విఫలమైంది. ఇటు బౌలింగ్‌లోనూ,అటు బ్యాటింగ్‌లోనూ నైట్‌రైడర్స్ ఆటగాళ్ళు ఏమాత్రం తెగువ చూపలేదు. మ్యాచ్‌ మొత్తం వన్ సైడెడ్‌గానే ముగిసింది. ముంబై జట్టు నిర్ధేశించిన 196 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో తడబడింది.

అంతకుముందు టాస్ గెలిచిన కోల్‌కత్తా కెప్టెన్ ముంబై ఇండియన్స్‌ను బ్యాటింగ్‌‌కు అహ్వనించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై  నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ ఫోర్లు, సిక్సులతో భారీ హిట్టింగ్ చేశాడు. 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 54 బంతుల్లో 3 ఫోర్లు 6 సిక్సర్లతో 80 పరుగులు చేసిన రోహిత్ శివం మావి బౌలింగ్ ఔటైయ్యాడు.

ముంబై కెప్టెన్‌తో పాటు మరో బాట్స్‌మెన్ సూర్యకుమార్ కూడా కోల్‌కత్తా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దాటిగా ఆడుతున్న సూర్య.. రోహిత్‌ కొట్టిన షాట్‌కు రెండో పరుగు తీసే ప్రయత్నంలో 47 పరుగుల వద్ద రనౌటయ్యాడు. తర్వాత వచ్చిన బాట్స్‌మెన్స్ ఎవరూ ధాటిగా ఆడలేకపోయారు. చివరకు ముంబై,కోల్‌కత్తాకు 196 పరుగుల టార్గెట్ నిర్ధేశించింది.

POINTS TABLE:

ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన కోల్‌కత్తా ఏ మాత్రం లక్ష్యాన్ని ఛేదించే దిశగా కనిపించలేదు. ఆ జట్టు సమిష్టిగా విఫలమైంది. చివరకు 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో మొత్తం మూడు వ్యూహాత్మక తప్పిదాలు కోల్‌కత్తాను ఓటమిపాలు చేసింది. ముఖ్యంగా రోహిత్ లాంటి స్టార్ హిట్టర్‌కు షార్ట్ పిచ్ బంతులు వేయడం. నైట్ రైడర్స్ బౌలర్లు కమ్మిన్స్, సందీప్ వారియర్, సునీల్ నరైన్‌లు  పదే పదే షార్ట్ పిచ్ బాల్స్ వెయడంతో దాన్ని అవకాశంగా మలుచుకున్న రోహిత్ బంతిని చక్కగా బౌండరీలకు తరలించాడు. 54 బంతుల్లో 80 పరుగులు చేశాడు.

SCHEDULE TIME TABLE: ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ కూర్పులో చేసిన తప్పిందాలు కూడా ఆ జట్టుకు శాపంగా మారాయి. జట్టులో ఒక ఇండియన్ ఆల్‌రౌండర్ కూడా తీసుకోకపోవడంతో ఆ లోపం స్పష్టంగా కనిపించింది. ఇక కోల్‌కతా స్టార్ అల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ ఘోరంగా విఫలమయ్యాడు. రస్సెల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో స్ధానంలో మార్పు చేసి ఉంటే బాగుండేదని ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఆరో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా రస్సెల్ బరిలోకి దిగాడు. అప్పటికే పరిస్ధితి చేయి దాటి పోయింది. ఈ మూడు తప్పిదాలు కోల్‌కత్తా ఓటమికి కారణమయ్యాయి.
Published by: Rekulapally Saichand
First published: September 24, 2020, 5:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading