RCB vs KKR: బెంగళూరుపై కోల్‌కతా ఆల్‌రౌండ్ విజయం.. బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన కేకేఆర్

బెంగళూరుపై కోల్‌కతా జట్టు అద్బుత విజయం (PC: IPL)

RCB vs KKR: అబుదాబిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా సోమవారం అబుదాబిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight riders) జట్టు 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 93 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం ఒకే వికెట్ కోల్పోయి ఛేదించడం విశేషం. కేకేఆర్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్ ధాటికి ఆర్సీబీ జట్టు కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక స్వల్ఫ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కేకేఆర్ జట్టు ధాటిగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు అరంగేట్రం క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ కలసి ఆర్సీబీ బౌలర్లను చితకబాదారు. తొలి ఓవర్ నుంచే బౌండరీలతో రెచ్చిపోయారు. స్వల్ప లక్ష్యాన్ని త్వరగా ఛేదించడం ద్వారా నెట్ రన్‌రేట్ మెరుగు పరచుకోవచ్చనే ఉద్దేశంతో కేకేఆర్ బ్యాట్స్‌మాన్ రెచ్చిపోయారు. ఓపెనర్లే మ్యాచ్‌ను ఫినిష్ చేస్తారని భావించారు. కానీ యజువేంద్ర చాహల్ స్పిన్ బౌలింగ్‌లో అర్దసెంచరీకి చేరువైన శుభమన్ గిల్ (48) మహ్మద్ సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు.

    ఓపెనర్లు ఇద్దరూ కలసి 81 పరుగులు జోడించారు. అయితే గిల్ అవుటయ్యాక ఆండ్రీ రస్సెల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ వెంకటేశ్ అయ్యర్ అతడికి ఛాన్స్ ఇవ్వకుండానే మ్యాచ్ ముగించాడు. అయ్యర్ 27 బంతుల్లోనే 41 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. దీంతో కేకేఆర్ జట్టు 10 ఓవర్లలోనే 94 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్‌లో అత్యధిక బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించిన ఐదో జట్టుగా కేకేార్ రికార్డు సాధించింది. కేకేఆర్ జట్టు 60 బంతులు ఉండగానే విజయం సాధించింది.









    ఆర్సీబీపై ఘనవిజయంతో 7వ స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 5వ స్థానానికి చేరుకున్నది. ఆర్సీబీ 3వ స్థానంలోనే కొనసాగుతున్నా నెట్ రన్‌రేట్ భారీగా పడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 2వ స్థానంలో కొనసాగుతున్నాయి.
    Published by:John Naveen Kora
    First published: