బోల్ట్‌ వేగాన్ని బీట్ చేసిన పరుగు వీరుడు శ్రీనివాస గౌడకు బంపర్ ఆఫర్...

ఇటీవల కర్నాటకలో జరిగిన కంబళ పోటీల్లో కంబళ జాకీ (గేదెలు, ఎద్దులను నియంత్రించే వ్యక్తి) శ్రీనివాస గౌడ్ (28) రికార్డు సృష్టించాడు.

news18-telugu
Updated: February 15, 2020, 3:03 PM IST
బోల్ట్‌ వేగాన్ని బీట్ చేసిన పరుగు వీరుడు శ్రీనివాస గౌడకు బంపర్ ఆఫర్...
కంబళ పోటీల్లో శ్రీనివాస గౌడ
  • Share this:
కర్ణాటకలోని కంబాల పందాల్లో మెరుపు వేగంతో పరిగెత్తి ఉసెన్ బోల్ట్ రికార్డును బ్రేక్ చేసిన శ్రీనివాస గౌడను ఇప్పడో అద్భుత అవకాశం వరించింది. స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో టాప్ కోచ్‌ల వద్ద అతడు శిక్షణ పొందేందుకు వెళ్లనున్నాడు. అతడిని ప్రొఫెషనల్ అథ్లెటిక్స్‌లో కోచింగ్‌ ఇస్తామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు చెప్పారు. ‘కర్ణాటకకు చెందిన శ్రీనివాస గౌడను సాయ్‌కు పిలుస్తాం. టాప్ కోచ్‌ల వద్ద ట్రయల్స్ వేస్తారు. ఒలింపిక్స్‌ ప్రమాణాల గురించి ప్రజలకు పెద్దగా అవగాహన ఉండదు. శారీరక ధృఢత్వం, ఓర్పు చాలా అవసరం. దేశంలో ప్రతిభ ఉన్న వారిని ఎవరినీ వదులుకోం.’ అని కిరణ్ రిజుజు ట్వీట్ చేశారు.

అయితే, అంతకు ముందు ప్రముఖ వ్యాపారవేత్త, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్ర ఓ ట్వీట్ చేశారు. ఈ కంబాల పరుగు వీరుడికి బంగారు పతకం ఇవ్వాలని కోరారు. ‘అతడి దేహదారుఢ్యాన్ని చూడండి. అథ్లెటిక్స్ లో విజయాలు సాధించే అసాధారణ ప్రతిభ అతడికి ఉంది. అందుకే, అతడికి 100 మీటర్ల్ స్ప్రింట్‌లో శిక్షణ కల్పించేలా కిరణ్ రిజుజు చూడాలి.’ అని కేంద్రమంత్రిని కోరారు.మరోవైపు కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కూడా ఈ అంశంపై స్పందించారు. శ్రీనివాస గౌడను అక్కున చేర్చుకుని అతడిని ఒలింపిక్స్ ఛాంపియన్‌గా తయారు చేయాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వారు ఇంకెంత మంది మరుగున పడిపోయారో అని అన్నారు.ఇటీవల కర్నాటకలో జరిగిన కంబళ పోటీల్లో కంబళ జాకీ (గేదెలు, ఎద్దులను నియంత్రించే వ్యక్తి) శ్రీనివాస గౌడ్ (28) రికార్డు సృష్టించాడు. కేవలం 13.62 సెకండ్లలోనే 142.50 మీటర్లు పరుగులు తీశాడు. అదే 100 మీటర్లకు లెక్కిస్తే.. కేవలం 9.55 సెకండ్లు మాత్రమే. గతంలో 100 మీటర్లను 9.58 సెకన్లలో పూర్తిన రికార్డు ఉసేన్ బోల్ట్ పేరిట ఉంది. ఈ లెక్కన 0.03 సెకన్ల ముందే శ్రీనివాస్ గౌడ ఈ ఫీట్ అందుకున్నట్లు భావించాలి.

ఐతే వాస్తవానికి కంబళ రికార్డును స్ప్రింట్‌తో సరిపోల్చకూడదు. ఎందుకంటే స్ప్రింట్‌లో వ్యక్తులు మాత్రమే పరుగెత్తతారు. కానీ కంబళలో రెండు గేదెలతో పాటు వాటి జాకీ పరుగెత్తుతాడు. ఈ స్పీడ్ అందుకున్న ఘనత గేదెలకే చెందినప్పటికీ.. వెనకాల నుంచి జాకీ తరమడం వల్లే ఆ వేగం అందుకుంటాయని.. అలాటంప్పుడు ఆ క్రెడిట్ జాకీకే దక్కుతుందంటున్నారు కన్నడిగులు. శ్రీనివాస గౌడను ఆకాశాతికెత్తుతూ.. ఫ్యూచర్ ఒలింపిక్ స్టార్‌గా కొనియాడుతున్నారు.
First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు