IPL 2019 : ఘన విజయంతో ముగిసిన పంజాబ్ ఐపీఎల్ పోరు..

Kings XI Punjab vs Chennai Super Kings | మొహాలీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్స్ లెవన్ పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

news18-telugu
Updated: May 5, 2019, 8:46 PM IST
IPL 2019 : ఘన విజయంతో ముగిసిన పంజాబ్ ఐపీఎల్ పోరు..
అర్థ సెంచరీతో చెలరేగిన కెఎల్ రాహుల్
news18-telugu
Updated: May 5, 2019, 8:46 PM IST
మొహాలీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్స్ లెవన్ పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్దేశించిన 171 పరుగుల టార్గెట్ ను పంజాబ్ సునాయసంగా ఛేదించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ 36 బంతుల్లో 71 పరుగులు చేసి చెలరేగడంతో పంజాబ్‌కు శుభారంభం లభించింది. తొలి వికెట్ కు రాహుల్, క్రిస్ గేల్ లు 108 పరుగుల పార్ట్ నర్ షిప్ నెలకొల్పారు. రాహుల్ ధాటిగా ఆడినప్పటికీ గేల్ మాత్రం ఆచితూచి ఆడుతూ 28 బంతుల్లో 28 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన నికోలస్ పూరన్ 3 సిక్సర్లతో విజృంభించగా, పంజాబ్ లక్ష్యం మరింత చేరువైంది. దీంతో పంజాబ్ కేవలం 4 వికెట్లు కోల్పోయి మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించింది.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్లు డుప్లెసిస్ కేవలం 55 బంతుల్లోనే 96 పరుగులు చేయగా, సురేష్ రైనా సైతం అర్థ శతకంతో రాణించాడు. కానీ చివరి ఓవర్లలో వరుసగా వికెట్లు పడటంతో ఊహించినంత భారీ స్కోరు దిశగా చెన్నై అడుగులు వేయలేకపోయింది. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమి 2, సామ్ కర్రన్ 3 వికెట్లు చొప్పున పడగొట్టడం విశేషం.

First published: May 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...