వెస్టిండీస్ మాజీ విధ్వంసకర ఆల్‌రౌండర్, కీరన్ పొలార్డ్ (Kieron Pollard) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ (IPL) కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు మంగళవారం ట్విటర్ వేదికగా పొలార్డ్ ఓ ప్రకటనను విడుదల చేశాడు. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంచైజీకి ధన్యవాదాలు తెలిపిన అతను కెరీర్ పట్ల గర్వంగా ఉందన్నాడు. " ముంబై ఇండియన్స్ కి గుడ్ బై చెప్పడం ఎమోషనల్ గా ఉంది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో చర్చల తర్వాత ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాను. ఇక, కొనాళ్లు ఆడాలనుకున్నాను. కానీ, ప్రస్తుత ఫామ్ రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నాను. అలాగే, వేరే జట్టుకు ఆడదల్చుకోలేదు. ముంబై ఇండియన్ గానే రిటైర్ అవ్వాలనుకున్నాను. అలాగే.. బ్యాటింగ్ కోచ్ గా, ముంబై ఎమిరేట్స్ ప్లేయర్ గా ఈ ఫ్రాంచైజీతో నా అనుబంధం కొనసాగుతుంది. ఇనాళ్ల ఐపీఎల్ కెరీర్ లో నాకు సహకరించిన ఫ్రాంచైజీ, కోచింగ్ స్టాఫ్, ఆటగాళ్లు, మేనేజర్లకు ధన్యావాదాలు తెలుపుతున్నాను. అలాగే, చివరగా నా ఫ్రెండ్స్, కుటుంబసభ్యులకు కూడా ధన్యవాదాలు " అంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశాడు పొలార్డ్.
విధ్వంసకర ఆటతీరుకు పెట్టింది పేరు కీరన్ పొలార్డ్. 10వేలకు పైగా పరుగులు.. 300కు పైగా వికెట్లు తీసి టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యున్నత ఆల్ఆరౌండర్గా పేరు పొందాడు. కానీ ఎందుకనో పొలార్డ్‌లో ఆ విధ్వంసం కొన్నాళ్లుగా కనబడడం లేదు. ఏ లీగులోనూ పొలార్డ్ ఈ మధ్యన పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. దీంతో, ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
????#OneFamily @KieronPollard55 pic.twitter.com/K5BVlTDeN0
— Mumbai Indians (@mipaltan) November 15, 2022
2010 నుంచి ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నపొలార్డ్.. ఈ జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. ముంబై తరఫున ఐపీఎల్లో 28.67 సగటుతో 3412 పరుగులు చేశాడు. వీటిలో 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ రాణించిన పొలార్డ్ 69 వికెట్లు కూడా తీశాడు. ఇక ఫీల్డింగ్‌లో అతని చురుకుదనం గురించి చెప్పనక్కర్లేదు. బౌండరీ లైన్ వద్ద పెద్ద గోడలా నిలబడే పొలార్డ్.. తన క్యాచులతోనే ముంబైను ఎన్నో మ్యాచుల్లో గెలిపించాడనడం అతిశయోక్తి కాదు.ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు కూడా గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
విండీస్ జట్టు తరఫున 123 వన్డేలు, 101 టీ20లు ఆడాడు. వన్డేల్లో 2706 పరుగులతో పాటు 55 వికెట్లు తీసిన పొలార్డ్.. 3 సెంచరీలు 13 హాఫ్ సెంచరీలు బాదాడు. టీ20ల్లో 1569 పరుగులతో పాటు 42 వికెట్లు పడగొట్టాడు. లిమిటెట్ ఫార్మాట్ లో చోటు దక్కించుకున్న పొలార్డ్.. ఒక టెస్టు కూడా ఆడకపోవడం విశేషం. ఇక, పొలార్డ్ ప్రకటనతో క్రికెట్ లవర్స్ షాక్ కు గురువుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IPL, Kieron pollard, Mumbai Indians