హోమ్ /వార్తలు /క్రీడలు /

Kidambi Srikanth: వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్.. దీపికా పదుకోన్ తండ్రి రికార్డును బద్దలు కొట్టిన తెలుగు తేజం

Kidambi Srikanth: వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్.. దీపికా పదుకోన్ తండ్రి రికార్డును బద్దలు కొట్టిన తెలుగు తేజం

BDF World Championships: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) చరిత్ర సృష్టించాడు. తొలి సారిగా ఈ మెగా టోర్నీలో ఫైనల్ చేరిన భారత షట్లర్‌గా రికార్డు సృష్టించాడు. మరోవైపు ఒకే ఏడాది ఇద్దరు షట్లర్లు వరల్డ్ చాంపియన్‌‌షిప్స్‌లో పతకాలు గెలవడం కూడా ఇదే తొలిసారి.

ఇంకా చదవండి ...

  భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. స్పెయిన్‌లోని వాల్వాలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌‌లో (World Championships) అద్భుతమైన ప్రదర్శన చేసి ఫైనల్ చేరుకున్నాడు. శనివారం స్పెయిన్‌లో జరిగిన రెండో సెమీస్‌లో ఇద్దరు భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) - లక్ష్య సేన్ (Lakshya Sen) మధ్య మ్యాచ్ జరిగింది. వరల్డ్ చాంపియన్‌షిప్స్‌ సెమీస్ చేరిన అతి పిన్నవయస్కుడైన భారతీయుడిగా రికార్డు సృష్టించిన లక్ష్యసేన్‌తో కిదాంబి శ్రీకాంత్ తలపడ్డాడు. ఇద్దరు భారత షట్లర్ల మధ్య హోరాహోరీగా గంటా 10 నిమిషాల పాటు జరిగిన జరిగిన మ్యాచ్ నిజంగా భారత బ్యాడ్మింటన్ ఫ్యాన్స్‌ను కంగారు పెట్టింది.

  పురుషుల సింగిల్స్‌లో భాగంగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ తొలి గేమ్‌లో ఆధిపత్యం సాదించాడు. తొల గేమ్‌లో సీనియర్ షటర్ల్ శ్రీకాంత్‌ను తన పదునైన డ్రాప్ షాట్లతో చిత్తు చేశాడు. తొల గేమ్‌ను 21-17తో సేన్ సొంతం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో కిదాంబి శ్రీకాంత్ పుంజుకున్నాడు. మధ్యలోకాస్త తడబడినా లక్ష్య సేన్‌పై ఆధిపత్యం ప్రదర్శించి గేమ్‌ను 21-14 తేడాతో కైవసం చేసుకున్నాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్ నువ్వా నేనా అన్నట్లు సాగింది.

  Ashes 2021-22 : ఆస్ట్రేలియాదే ఆధిప‌త్యం.. ఫాలో ఆన్ త‌ప్పించుకొన్న ఇంగ్లాడ్‌

  లక్ష్య సేన్ 10వ పాయింట్ వరకు హోరాహోరీగా మ్యాచ్‌ను కొనసాగించాడు. కానీ ఆ తర్వాత సీనియర్ ప్లేయర్ శ్రీకాంత్ షాట్లకు సేన్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఆఖర్లో దూకుడుగా ఆడే క్రమంలో లక్ష్య సేన్ పాయింట్లు పోగొట్టుకొన్నాడు. దీంతో ఆఖరి గేమ్ కూడా శ్రీకాంత్ వశమైంది. దీంతో శ్రీకాంత్ 17-21, 21-14, 21-15 తేడాతో సెమీఫైన్‌లో గెలిచి ఫైనల్ చేరుకున్నాడు.

  IPL 2022: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న గౌతమ్ గంభీర్.. అత్యంత విలువైన జట్టులో చేరిన ఐపీఎల్ ఛాంపియన్ కెప్టెన్..

   ఒక భారత బ్యాడ్మింటన్ పురుష ప్లేయర్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ చేరుకోవడం ఇదే తొలిసారి. 28 ఏళ్ల క్రితం దీపికా పదుకోన్ తండ్రి ప్రకాశ్ పదుకోన్ తొలి సారిగా వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం నెగ్గాడు. ఆ తర్వాత 2018లో సాయి ప్రణీత్ కూడా కాంస్యం గెలిచాడు. అయితే ఈ ఏడాది ఇద్దరు భారత షట్లర్లు సెమీస్ చేరుకొని ఫైనల్ బెర్త్ కోసం ఒకే మ్యాచ్‌లో తలపడ్డారు.

  IND vs SA: ఇండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. త్వరలో ప్రకటించే అవకాశం

   ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ ఓడిపోవడంతో అతడికి కాంస్యం దక్కుతుంది. అయితే కిదాంబి శ్రీకాంత్ ఫైనల్ చేరడంతో.. స్వర్ణం లేదా రజతం కచ్చితంగా గెలుస్తాడు. ప్రకాశ్ పదుకోన్ నెలకొల్పిన రికార్డును తొలి సారిగా కిదాంబి శ్రీకాంత్ బద్దలు కొట్టాడు. కాగా, వుమెన్స్ సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్‌లోనే వెనుదిరిగింది. కానీ ఈ సారి పురుషులు రెండు పతకాలు తీసుకొని రాబోతుండటం బ్యాడ్మింటన్ ఫ్యాన్స్‌కు నిజంగా ఉత్సాహాన్ని తెప్పిస్తున్నది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  Tags: Badminton, Pullela Gopichand

  ఉత్తమ కథలు