Home /News /sports /

KHURASIYA HAS THE RARE DISTINCTION OF CLEARING THE IAS EXAM BEFORE HE STARTED PLAYING FOR INDIA JNK

IAS Cricketer: ఐఏఎస్ ఎగ్జామ్ క్లియర్ చేసి.. టీమ్ ఇండియా తరపున క్రికెట్ ఆడాడు.. అతడెవరో తెలుసా? ఇప్పుడేం చేస్తున్నాడు?

ఐఏఎస్ పాసైన ఆ క్రికెటర్ ఎవరు?

ఐఏఎస్ పాసైన ఆ క్రికెటర్ ఎవరు?

IAS Cricketer: టీమ్ ఇండియాలో ఏ క్రికెటర్‌ను తీసుకున్న ఆట కోసం చదవును ఆపేసిన వాళ్లో లేదంటే క్రికెట్ కొనసాగిస్తూనే మరోవైపు చదువుకున్న వాళ్లో కనపడతారు. కానీ ఒక వ్యక్తి అయితే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (ఐఏఎస్) ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత క్రికెటర్ అయ్యాడు.

ఇంకా చదవండి ...
    ఇండియాలో (India) క్రికెట్‌కు (Cricket) ఉన్నంత క్రేజ్ మరే ఇతర క్రీడలకూ లేదు. దీంతో చిన్నప్పుడే క్రికెట్‌ను కెరీర్‌గా మలుచుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. క్రికెట్ కోసం చాలా మంది తమ చదువులను (Education) కూడా ఫణంగా పెడుతుంటారు. జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రికెట్ ఆడుతున్న వాళ్లలో ఉన్నత చదువులు చదివిన వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. స్టార్ క్రికెటర్లుగా మారిన వారిలో చాలా మంది టెన్త్, ఇంటర్ వరకు మాత్రమే చదివిన వాళ్లు ఉన్నారు. సచిన్ (Sachin), కోహ్లీ (Virat Kohli) వంటి క్రికెటర్లు కనీసం గ్రాడ్యుయేషన్ కూడా చేయలేదు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) అయితే క్రికెట్ అయ్యాక డిగ్రీ పాసవ్వడానికి నానా కష్టాలు పడ్డాడు. ఇప్పటికీ ఆ డిగ్రీ పూర్తయ్యిందో లేదో కూడా తెలియదు. కానీ ఉన్నత చదువులు చదివి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వాళ్లు చాలా మందే ఉన్నారు. తమ చదువులను కూడా క్రికెట్ కెరీర్‌లో ఉపయోగించిన వాళ్లూ ఉన్నారు.

    టీమ్ ఇండియా తరపున ఆడిన జవగళ్ శ్రీనాథ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనిల్ కుంబ్లే కూడా ప్రఖ్యాత రాష్ట్రీయ విద్యాలయా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నాడు. మాజీ క్రికెటర్, ప్రస్తుతం టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎంబీఏ పూర్తి చేశాడు. మద్రాస్‌లోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో క్రిష్ణమాచారి శ్రీకాంత్ గ్రాడ్యేయేట్ అయ్యాడు. ఇక చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయి వచ్చి చెన్నై వీధుల్లో పెరిగిన మురళి విజయ్.. క్రికెటర్‌గా మారిన తర్వాత డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎంఫిల్ కూడా పూర్తి చేసి చిన్నప్పుడే ఆగిపోయిన చదవును పూర్తి చేసుకున్నాడు.

    T20 World Cup Champions: ఇప్పటి వరకు ఎన్ని సార్లు టీ20 వరల్డ్ కప్ జరిగింది? ఎవరెవరు చాంపియన్స్ అయ్యారు?


    టీమ్ ఇండియాలో ఏ క్రికెటర్‌ను తీసుకున్న ఆట కోసం చదవును ఆపేసిన వాళ్లో లేదంటే క్రికెట్ కొనసాగిస్తూనే మరోవైపు చదువుకున్న వాళ్లో కనపడతారు. కానీ ఒక వ్యక్తి అయితే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (ఐఏఎస్) ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత క్రికెటర్ అయ్యాడు. టీమ్ ఇండియా తరపున ఆడక ముందే అతడు సివిల్స్ ఎగ్జామ్ పాసై పోయాడు. అతనే అమయ్ ఖురాసియా. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో పుట్టిన అమయ్ చిన్నప్పటి నుంచే చదువుతో పాటు క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించాడు. 1989/90లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే సమయానికే అతను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. సివిల్స్ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత అతడికి టీమ్ ఇండియా తరపున ఆడే అవకాశం వచ్చింది.

    అమయ్ ఖురాసియా (File)


    1999లో జరిగిన పెప్సీ కప్‌లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన అమయ్ ఖరాసియా ఆ మ్యాచ్‌లో 45 బంతుల్లో 57 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ఏడాది 10 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 1999 వరల్డ్ కప్‌లో కూడా టీమ్ ఇండియా తరపున ఎంపికయ్యాడు. కానీ అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 2001లో మరో రెండు వన్డేలు ఆడిన తర్వాత అమయ్ ఖురాసియాకు ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశాలు రాలేదు. అయితే 1989/90 నుంచి 2005/06 సీజన్ వరకు వరుసగా మధ్యప్రదేశ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఇక మధ్యప్రదేశ్ రంజీ జట్టులో కూడా స్థానం కోల్పోయిన తర్వాత అమయ్ ఖురాసియా 2007 ఏప్రిల్ 22న క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. అమయ్ ఖురాసియా ప్రస్తుతం ఇండియన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Bcci, Civil Services, Team india

    తదుపరి వార్తలు