ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ నిషేధం తర్వాత తిరిగి క్రికెట్లో అడుగుపెట్టిన పేస్ బౌలర్ శ్రీశాంత్ విజయ్ హాజరే ట్రోఫిలో సత్తా చాటాడు. అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 15 ఏళ్ల తర్వాత ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఉత్తరప్రదేశ్, కేరళ మధ్య మ్యాచ్‌లో శ్రీశాంత్ ఈ ఘనత సాధించాడు. 9.3 ఓవర్లు వేసిన అతడు 65 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. దీంతో యూపీ 283 పరుగులకు ఆలౌటైంది. చివరిసారి 2006లో ఓ లిస్ట్ ఎ ఫార్మాట్ మ్యాచ్‌లో శ్రీశాంత్ ఐదు వికెట్లు తీశాడు. టోర్నీలో తాను ఆడిన తొలి మ్యాచ్‌లో అతడు రెండు వికెట్లు తీసుకున్నాడు. అభిషేక్ గోస్వామి , అక్షదీప్ నాథ్ , భువనేశ్వర్ కుమార్ , మొహ్సిన్ ఖాన్ , శివం శర్మ ల వికెట్లను శ్రీశాంత్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీశాంత్ 87 లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 113 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 6/55 ఉత్తమ గణాంకాలు. శ్రీశాంత్ చెలరేగడంతో యూపీ 283 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం కేరళ 40 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఇక టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లో శ్రీశాంత్ రెండు వికెట్లు తీసుకున్నాడు.
ఐపీఎల్ 2021లో ఆడాలని శ్రీశాంత్ ఆశపడినా.. అతనిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడంతో కనీసం వేలానికి కూడా అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మినీ వేలం కోసం మొత్తంగా 1114 మంది ఆటగాళ్లు పేరు నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీ యాజమాన్యాల సూచనల ప్రకారం 292 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో దాదాపు 7-8 ఏళ్లుగా క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్‌కు నిరాశే ఎదురైంది. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. ఈ నెల 18న చెన్నైలో వేలం ముగిసిన విషయం తెలిసిందే.
బీసీసీఐ ప్రకటించిన ఫైనల్ లిస్ట్ లో తన పేరు లేకపోవడంపై శ్రీశాంత్ స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసిన శ్రీశాంత్ కాస్త భావోద్వేగం చెందాడు. "ఐపీఎల్ 2021 కోసం బీసీసీఐ ప్రకటించిన తుది జాబితాలో నా పేరు లేకపోవడం బాధగా ఉన్నా.. దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మరింత సానుకూలంగా ముందుకు సాగుతా. నాపై ప్రేమను చూపించిన అభిమానులకు కృతజ్ఞతలు. నాకింకా 38 ఏళ్లే. క్రికెట్‌ను అంత తేలిగ్గా వదలను. మరింత ఎక్కువగా కష్టపడి వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడేందుకు ప్రయత్నిస్తా" అని శ్రీశాంత్ అన్నాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.