• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • KERALA PLANE CRASH VIRAT KOHLI AND SACHIN TENDULKAR OFFER CONDOLENCES TO AIR INDIA CRASH VICTIMS

Kerala Plane Crash: కేరళ విమాన ప్రమాదంపై కోహ్లీ, సచిన్ షాక్

Kerala Plane Crash: కేరళ విమాన ప్రమాదంపై కోహ్లీ, సచిన్ షాక్

విరాట్ కొహ్లీ ( Image : AP Photo)

Kerala Plane Crash: కేరళలోని కోజికోడ్‌లో గతరాత్రి సంభవించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రమాద ఘటన పట్ల విరాట్ కోహ్లీ, సచిన్ టెండుల్కర్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

  • Share this:
    కేరళ‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందారు. మరో 123 మంది గాయపడ్డారు.క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమం ఉంది. దుబాయ్ నుంచి కోజికోడ్‌‌కు వచ్చిన విమానం కరిపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో స్కిడ్ కావడంతో విమానం రెండు ముక్కలయ్యింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు పలువురు భారత క్రికెటర్లు ప్రగాఢ సంతాపం తెలిపారు.

    కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ...బాధితుల కోసం ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.



    Kerala Plane Crash, air india plane crash, kozikode plane crash, latest news plane crash,plane crash,plane crash in kerala,kerala plane accident,plane crash landing kerala,amit shah on kerala plane crash,kerala plane,air india crash today,air india flight crash,crashes in kerala,air india plane crash today,air india plane crash history,air india plane crash investigation,ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, కేరళ విమాన ప్రమాదం, కూలిన విమానం,
    కేరళలో విమాన ప్రమాదం


    అటు సచిన్ టెండుల్కర్ కూడా ఈ విమాన ప్రమాదం పట్ల విచారం వ్యక్తంచేశారు. ప్రమాదంలో బాధితుల కోసం ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.



    అలాగే మరో ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సహా పలువురు క్రికెటర్లు విమాన ప్రమాదం ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.



    కేరళలో గత రాత్రి సంభవించిన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా 18 మంది దుర్మరణం చెందారు.
    Published by:Janardhan V
    First published: