Home /News /sports /

KERALA FOOTBALL GALLERY COLLAPSE MORE THAN 50 INJURED 15 IN CRITICAL AS GALLERY COLLAPSED IN FOOTBALL MATCH SK

Football Gallery Collapse: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కుప్పకూలిన గ్యాలరీ.. కేరళలో ఘోర ప్రమాదం.. షాకింగ్ వీడియో

కుప్పకూలిన ఆడియెన్స్ గ్యాలరీ

కుప్పకూలిన ఆడియెన్స్ గ్యాలరీ

Kerala Football gallery collapse: మ్యాచ్ ప్రారంభమై కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. పైవరుసలో ఉన్న వారంతా గాల్లోకి ఎగిరి గ్రౌండ్‌లో పడిపోయారు. కొంత మంది ఫ్లడ్ లైట్స్ కింద చిక్కుకుపోయారు.

    కేరళ (Kerala)లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ప్రేక్షకుల గ్యాలరీ (Football Gallery Collapse) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది.  మలప్పురం జిల్లాలోని పూంగోడ్‌లో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కేరళలో ఆల్ ఇండియా సెవెన్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి పూంగోడ్‌లోని LP స్కూల్ గ్రౌండ్‌లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫుట్ బాల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్ కావడంతో.. గ్రౌండ్ సామర్థ్యానికి మంచి ఎక్కువ మంది వచ్చారు. ఏకంగా 8వేల మంది హాజరైనట్లు స్థానికులు తెలిపారు.

    సురేష్ రైనా ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. మిస్టర్ ఐపీఎల్ కు ఆ దేశ ప్రతిష్టాత్మక అవార్డు..

    ఆడియన్స్ మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో గ్యాలరీలోని కొంత భాగం కుప్పకూలింది. మ్యాచ్ ప్రారంభమై కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. పైవరుసలో ఉన్న వారంతా గాల్లోకి ఎగిరి గ్రౌండ్‌లో పడిపోయారు. కొంత మంది ఫ్లడ్ లైట్స్ కింద చిక్కుకుపోయారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వారిని కాపాడే ప్రయత్నం చేశారు. గాయపడ్డ వారిని మంజేరి ఆస్పత్రికి తరలించారు. కొందరికి ప్రాథమిక చికిత్స చేసి ఇళ్లకు పంపించగా.. తీవ్రంగా గాయపడ్డ వారికే ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.



    ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇటీవల మలప్పురం జిల్లాలో వర్షాలు భారీగా కురిశాయి. ఆ వర్షాల వల్ల నేల కుంగిపోవడం కూడా ఘటనకు ఓ కారణమని స్థానికులు తెలిపారు. కానీ సామర్థ్యానికి మించి ఎక్కువ మందిని అనుమతించడమే ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. ఫైనల్ మ్యాచ్ కావడంతో భారీ ఎత్తున తరలి వచ్చారని.. వారిని కంట్రోల్ చేయడం తమ వల్ల కాలేదని నిర్వాహకులు వివరించారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని తెలిపారు.

    పైన పటారం లోన లొటారం.. ఈ ఏడాదైనా ఆర్సీబీ కప్పు కొట్టేనా.. తుది జట్టు అంచనా ఇదే..!

    సరిగ్గా ఏడాది క్రితం తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మార్చి 22, 2021న కబడ్డీ మ్యాచ్‌లో గ్యాలరీ కూలిపోయింది. 47వ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. మైదానంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలిపోయింది. ఆ ఘటనలో సుమారు 100 మందికి పైగా ప్రేక్షకులకు తీవ్ర గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందజేశారు. గ్రౌండ్ సామర్థ్యానికి మించి ఎక్కువ మంది హాజరవడంతోనే ప్రమాదం జరిగింది. ఇప్పుడు కేరళలో కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Football, Kerala

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు