దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన కార్యక్రమం KBC(కౌన్ బనేగా కరోడ్‌పతీ). ఇందులో ఎందరో ప్రముఖులు పాల్గొంటారు. కౌన్ బనేగా కరోడ్‌పతి.. ఇప్పటివరకు 12 సీజన్లు ముగిశాయి. తాజాగా... శనివారం నుంచి కేబీసీ 13వ సీజన్ మొదలవుతోంది. తొలివారం స్పెషల్ ఎపిసోడ్ కోసం టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) అతిథులుగా వచ్చారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కేబీసీ నేపథ్యంలో ఓ సినిమా కూడా బాలీవుడ్‌లో వచ్చి రికార్డులు సృష్టించింది. ఏకంగా జాతీయ అవార్డులను కూడా కొల్లగొట్టింది. హిందీలోనే కాకుండా పలు భాషల్లో కూడా ఈ షో సక్సెస్ అయింది. తెలుగులో 'మీలో ఎవరు కోటిశ్వరుడు' పేరుతో షో విజయవంతం అయింది. 'కింగ్' నాగార్జునతో షో మరింత పాపులర్ అయింది
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లు కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) 13వ సీజన్ స్పెషల్ ఏపిసోడ్ లో సందడి చేశారుర. ఇప్పటికే విడుదలైన ప్రోమో వైరల్‌గా మారింది. కెరీర్ సహా అనేక విశేషాలు పంచుకున్న దాదా, వీరూ.. ఏకంగా కేబీసీ హోస్ట్, బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్‌నే హాట్‌సీట్లో కోర్చుబెట్టారు.
గంగూలీ అడిగిన ప్రశ్నలకు బిగ్‌బీ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఈ షోలో గంగులీ, సెహ్వాగ్ రూ.25లక్షలు గెలుచుకున్నారు. అయితే రూ.50 లక్షల ప్రశ్నకు వారు సమాధానం ఇవ్వలేకపోయారు. అయితే తాము గెలుచుకున్న రూ.25 లక్షలను ధార్మిక పనుల కోసం భారత మాజీలు విరాళంగా ఇచ్చారు.
కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) షో అంతలా పాపులర్ అవ్వడానికి అమితాబ్ బచ్చన్ కూడా ఓ కారణమనే చెప్పాలి. తన వ్యాఖ్యానం, హావభావాలతో అభిమానులను ఎంతగానో ఆకటుకున్నారు. ఈ షోలో సాధారణంగా అమితాబ్ బచ్చన్ అందరినీ ప్రశ్నలడిగితే.. ఆయన సీటును సౌరవ్ గంగూలీ తీసుకొని బిగ్‌బీని హాట్‌సీట్లో కూర్చోబెట్టాడు. బిగ్‌బీకి వరుసగా క్రికెట్ ప్రశ్నలు వేశాడు.
ఇది కూడా చదవండి : నీ దూకుడు సాటెవ్వడూ.. ఆసియాలోనే ఎవ్వరికీ సాధ్యంకాని ఫీట్ కోహ్లీ సొంతం..
అందుకు వీరూ సాయం కూడా తీసుకోమన్నాడు. కొన్నింటికి అమితాబ్ సమాధానాలు చెప్పలేకపోయారు. ఇలా యాంకర్‌గా దాదా అదరగొట్టాడు. దాదా ప్రతిభను చూసిన బిగ్‌బీ.. ముగ్దుడయ్యారు. "ఇలాగే కొనసాగితే నా పనికే ఎసరు పెడతారేమో" అని బిగ్‌బీ సరదాగా వ్యాఖ్యానించారు. దానికి దాదా కూడా తనదైన శైలిలో జవాబిచ్చాడు. "ఒకవేళ నేను హోస్ట్‌గా చేయాల్సి వస్తే.. ముందుగా మీ వీడియోలు చూసి నేర్చుకుంటా" అంటూ భారత మాజీ కెప్టెన్ నవ్వులు పూయించారడు.
View this post on Instagram
ఇక డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన రీతిలో హాస్యం పండించాడు. తాను ఆడే రోజుల్లో జట్టు సభ్యులతో, మైదానంలో ఎలా పంచులు వేశేవాడో.. కేసీబీలో కూడా అలానే సందడి చేశాడు. తన కెరీర్ పట్ల చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాడు. ఇక టీమిండియాకు అవసరమైన ప్రతిసారీ అప్పటి కెప్టెన్ అయినా సౌరవ్ గంగూలీ తనపై ఆధారపడేవాడని చెప్పుకొచ్చాడు. వేగంగా పరుగులు చేయాలన్నా, దూకుడుగా ఆడాలన్నా, ఫీల్డింగ్ అవసరమైనా, బౌలింగ్ చేయాలన్నా, జట్టుకు విజయం అందించాలన్నా తనను దాదా ఎప్పుడూ ఉపయోగించుకొనేవాడని వీరూ చెప్పాడు.
ఇది కూడా చదవండి : కోచ్ పై మనికా బాత్రా సంచలన ఆరోపణలు.. అతను అలా చేయమన్నడంటూ..
ఈ షోలో సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ రూ.25లక్షలు గెలిచారు. అయితే రూ.50 లక్షల ప్రశ్నకు వారు సమాధానం చెప్పలేకపోయారు. ఆ ప్రశ్న ఏంటంటే.. ఆజాద్ హింద్ రేడియో సేవలు మొదట నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో 1942లో ఏ దేశంలో మొదలయ్యాయి?. జపాన్, జర్మనీ, సింగపూర్, బర్మా.. ఆప్షన్స్ ఇవ్వగా దాదా, వీరూ నిర్దేశిత సమయంలో జవాబు చెప్పలేదు. దాంతో భారత మాజీలు రూ.50 లక్షలు గెలవలేకపోయారు. ఇక, ఆ ప్రశ్నకు సరియైన సమాధానం జర్మనీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Bollywood news, Cricket, Sourav Ganguly, Virender Sehwag