• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • KARNATAKA LEGEND INDIAN PLAYER VINAY KUMAR ANNOUNCES RETIREMENT FROM INTERNATIONAL CRICKET SRD

Vinay Kumar : అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా క్రికెటర్ గుడ్ బై....భావోద్వేగపు పోస్ట్...

Vinay Kumar : అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా క్రికెటర్ గుడ్ బై....భావోద్వేగపు పోస్ట్...

Vinay Kumar (ఫైల్ ఫోటో)

Vinay Kumar : కర్ణాటక రంజీ స్టార్ ప్లేయర్, టీమిండియా సీనియర్ పేసర్ ఆర్. వినయ్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ తో పాటు..అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.

  • Share this:
    కర్ణాటక రంజీ స్టార్ ప్లేయర్, టీమిండియా సీనియర్ పేసర్ ఆర్. వినయ్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ తో పాటు..అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. తన రిటైర్మెంట్ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఈ సందర్భంగా భావోద్వేగపు పోస్ట్ పెట్టాడు. "రిటైర్మెంట్‌ అనే పదం వినడానికి బాధగా ఉన్నా.. ప్రతీ ఒక్కరు ఏదో ఒక దశలో కెరీర్‌కు గుడ్‌బై చెప్పాల్సిందే. నా రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. ఈరోజుతో నా ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు ముగింపు పలుకుతున్నా. టీమిండియా తరపున అంతర్జాతీయ జట్టుకు ఆడడం నా గౌరవంగా భావిస్తున్నా. అనిల్‌ కుంబకలే, రాహుల్‌ ద్రవిడ్‌, ఎంఎస్‌ ధోని, గౌతమ్‌ గంభీర్‌, విరాట్‌ కోహ్లి, సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ లాంటి ఆటగాళ్లతో ఆడడం నా అదృష్టం. ఇన్నాళ్లు మీరిచ్చిన మద్దతుకు నా ధన్యవాదాలు" అంటూ ఉద్వేగంతో పోస్ట్ చేశాడు.




    వినయ్‌ కుమార్‌ టీమిండియా తరపున 2010లో అరంగేట్రం చేశాడు. భారత్‌ తరపున 31 వన్డేల్లో 38 వికెట్లు, 9 టీ20ల్లో 10 వికెట్లతో పాటు ఒక్క టెస్టు మ్యాచ్‌ ఆడి ఒక వికెట్‌ తీశాడు. ఇక ఐపీఎల్‌లో 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరపున ఐపీఎల్‌లో పాల్గొన్న వినయ్‌ కుమార్‌ ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. మొత్తం ఐపీఎల్‌లో 105 మ్యాచ్‌లాడి 105 వికెట్లు పడగొట్టాడు. ఇక కర్ణాటక రంజీ టీమ్ కు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. వినయ్‌ కుమార్‌ సారధ్యంలో కర్ణాటక జట్టు 2013-14, 2014-15 రంజీ ట్రోపీ టైటిల్స్‌ను సాధించింది. వినయ్ కుమార్ భవిష్యత్తు సూపర్ గా ఉండాలంటూ మాజీ క్రికెటర్ సురేష్ రైనా ట్వీట్ చేశాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు