Kapil Dev: కుదుటపడిన కపిల్ దేవ్ ఆరోగ్యం, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

రెండు రోజుల పాటు ఐసీయూలో ఉన్న తర్వాత కపిల్ దేవ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కపిల్ ఆరోగ్యం కుదుటపడడంతో ఆస్పత్రి నుంచి ఇంటికి చేరినట్టు మరో క్రికెటర్ చేతన్ శర్మ తెలిపారు.

news18-telugu
Updated: October 25, 2020, 3:11 PM IST
Kapil Dev: కుదుటపడిన కపిల్ దేవ్ ఆరోగ్యం, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
తనకు చికిత్స చేసిన డాక్టర్ అతుల్‌తో కపిల్ దేవ్ (Image; Chetan Sharma/Twitter)
  • Share this:
క్రికెట్ లెజెండ్, భారత్‌కు మొదటి వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ కోలుకున్నారు. ఆయనకు రెండు రోజుల క్రితం హార్ట్ ఎటాక్ రావడంతో ఢిల్లీలోని  ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయనకు డాక్టర్లు ఆంజియో ప్లాస్టీ చేశారు. కపిల్ దేవ్‌కు డయాబెటిస్, ఇతర అనుబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కపిల్ దేవ్‌కు హార్ట్ ఎటాక్ అనగానే క్రికెట్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. రెండు రోజుల పాటు ఐసీయూలో ఉన్న తర్వాత కపిల్ దేవ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కపిల్ ఆరోగ్యం కుదుటపడడంతో ఆస్పత్రి నుంచి ఇంటికి చేరినట్టు మరో క్రికెటర్ చేతన్ శర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ఫోటోను ట్వీట్ చేశారు. అలాగే కపిల్ దేవ్‌కు ఆంజియో ప్లాస్టీ చేసిన డాక్టర్ అతుల్ మాథుర్‌లో హర్యానా హరికేన్ కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘ఆయన (కపిల్ దేవ్) ఆరోగ్యంగా ఉన్నాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో దిగిన ఫొటో’ అంటూ ఓ ఫొటోను ట్వీట్ చేశారు.



1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యులంతా వాట్సాప్‌లో ఓ గ్రూప్‌ను రన్ చేస్తున్నారు. ఇందులో వారికి సంబంధించిన విశేషాలు.. అలాగే ఆసక్తికరమైన విశేషాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే కపిల్ అనారోగ్యానికి గురయ్యాడని తెలియడంతో.. అతని మాజీ టీమ్‌మేట్స్ ఆ దిగ్గజ క్రికెటర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మెసేజ్‌లు పెట్టారు. అయితే దీనికి ఇచ్చిన రిప్లైలో.. తాను క్షేమంగానే ఉన్నానని కపిల్ తెలిపారు. "అందరికీ నమస్కారం. నేను మంచి ఉత్సాహంతో ఉన్నాను. బాగానే ఉన్నాను. వేగంగా కోలుకుంటున్నాను. నా గోల్ఫ్ ఆటకు తిరిగి రావడానికి వేచి ఉండలేను. మీరంతా నా కుటుంబం. థ్యాంక్యూ" అని కపిల్ పేర్కొన్నాడు.



మన దేశానికి తొలి క్రికెట్ ప్రపంచ కప్ కపిల్ దేవ్ సారధ్యంలోనే వచ్చింది. 16 ఏళ్ల పాటు టీమిండియాలో ఉన్న కపిల్ దేవ్.. 131 టెస్ట్‌లు, 225 వన్డే మ్యాచ్‌లు ఆడారు. ప్రపంచంలో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. టెస్ట్‌ల్లో 5248 పరుగులతో పాటు 434 వికెట్లు తీశారు. ఇక వన్డేల్లో 3783 రన్స్‌తో పాటు 253 వికెట్లు సాధించారు. 1983 వరల్డ్ కప్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్ చేసిన 175 పరుగులు వన్డేల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది. మన దేశానికి తొలి వరల్డ్ కప్ అందించిన హర్యానా హరికేన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేశారు.

1983లో ప్రపంచ కప్‌తో కపిల్‌దేవ్ (Getty Images)
ప్రపంచ కప్‌తో కపిల్ దేవ్ (File)


భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రపంచ దిగ్గజ ఆల్ రౌండర్లలో ఒకరైన కపిల్ దేవ్ సారధ్యంలోనే ఇండియా వరల్డ్ కప్‌ను 1983లో గెలుచుకుంది. కపిల్ దేవ్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. క్రికెట్‌కు సంబంధించి అప్ డేట్స్ మీద తన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు. ఐపీఎల్‌కు సంబంధించి కూడా అప్పుడప్పుడు తన అభిప్రాయాలు తెలుపుతారు. కపిల్ దేవ్ బయోపిక్ 83 పేరుతో రాబోతోంది. రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ కావాల్సి ఉంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 25, 2020, 3:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading