David Warner : " మనద్దరి బంధం గట్టిదనుకున్నా.. కానీ నువ్వేమో ".. కేన్ మామ చేసిన పనికి తీవ్ర బాధలో వార్నర్..

Kane Williamson - David Warner

David Warner : మరోవైపు జట్టు పర్ఫామెన్స్ కంటే ఎక్కువగా డేవిడ్ వార్నర్‌కి జరిగిన పరాభవం, ఆరెంజ్ ఆర్మీ అభిమానులను మరింతగా బాధపెట్టింది.

  • Share this:
    ఐపీఎల్ 2021 సీజన్‌ (IPL 2021 Season Latest Updates) సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌ (Sunrisers Hyderabad)కి ఏ మాత్రం కలిసి రాలేదు. ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 42 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక, ఈ సీజన్ లో తన జర్నీని ఉద్దేశించి జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పాటు సపోర్ట్ స్టాఫ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. " ఈ సీజన్ మాకు కలిసిరాలేదు. కానీ ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. ఆరెంజ్ ఆర్మీ ఆటగాళ్లతో ఆడేందుకు ఎప్పుడూ సంతోషంగా ఫీలవుతా. అండగా నిలిచిన అభిమానులకు,సపోర్ట్ స్టాఫ్‌కు ధన్యవాదాలు " అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌కు కొన్ని ఫొటోలను కూడా జత చేశాడు. అయితే ఈ ఫొటోలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన ఆటగాళ్లంతా ఉండగా.. మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాత్రం లేడు.

    దీంతో అతను కేన్ విలియమ్సన్‌ను నిలదీశాడు. " కేన్.. నీవు షేర్ చేసిన ఫొటోల్లో నేను లేను. మనద్దరి బంధం గట్టిదనుకున్నా" అంటూ బాధతో కూడిన ఏమోజీలను కామెంట్ చేశాడు. దీనికి కేన్ మామ సైతం బదులిచ్చాడు. అయ్యో అనే ఏమోజీని రిప్లే ఇచ్చాడు. ఇక, అంతకుముందు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) భావోద్వేగానికి గురయ్యాడు. హైదరాబాద్ జట్టుతో పాటు అభిమానులను మిస్ అవుతానని తెలిపాడు. ఇన్నాళ్లు అండగా నిలిచిన అభిమానులుకు సరిపడా కృతజ్ఞతలు చెప్పలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు వార్నర్ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ను పంచుకున్నాడు.

    మరోవైపు జట్టు పర్ఫామెన్స్ కంటే ఎక్కువగా డేవిడ్ వార్నర్‌కి జరిగిన పరాభవం, ఆరెంజ్ ఆర్మీ అభిమానులను మరింతగా బాధపెట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును సొంత టీమ్ కంటే ఎక్కువగా అభిమానించే డేవిడ్ వార్నర్‌ను సీజన్ మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది టీమ్ మేనేజ్‌మెంట్.ఆ తర్వాత అతనికి తుదిజట్టులో కూడా చోటు దక్కలేదు. ఫేజ్ 2లో రెండు మ్యాచుల్లో ఆడిన డేవిడ్ వార్నర్, ఆ తర్వాత కొన్ని మ్యాచుల్లో స్టేడియంలో కూడా కనిపించలేదు.








    View this post on Instagram






    A post shared by Kane Williamson (@kane_s_w)





    హోటల్ నుంచి స్టేడియానికి వచ్చి, జట్టును ఉత్సాపరిచేందుకు కూడా డేవిడ్ వార్నర్‌ను అనుమతించలేదని తెలిసింది. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో ఆఖరి రెండు మ్యాచుల సమయంలో స్టేడియంలో కనిపించాడు వార్నర్.



    అయితే ఈ వీడియోలో డేవిడ్ వార్నర్ కనిపించలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏ వీడియో పోస్టు చేసినా, ఏ ఫోటో పెట్టినా... దానికి స్పందించే వార్నర్ భాయ్, ఈ వీడియోకి కూడా స్పందించాడు. చాలామంది అభిమానులు, ఈ వీడియోలో డేవిడ్ వార్నర్ ఎందుకు లేడంటూ ప్రశ్నించారు. వారికి సమాధానం ఇచ్చిన వార్నర్... " ఇలా వీడియో చేయమని నన్ను ఎవ్వరూ అడగలేదు..." అంటూ రిప్లై ఇచ్చాడు.


    సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం ఎంతో చేసిన ఓ లెజెండరీ క్రికెటర్‌ని ఇంతలా అవమానించడం, టీమ్ మేనేజ్‌మెంట్‌కి ఏ మాత్రం భావ్యం కాదని అంటూ, ఆరెంజ్ ఆర్మీని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. కేదార్ జాదవ్, ధోనీ వంటి ప్లేయర్లు గత సీజన్‌లో ఎంత ఘోరంగా ఫెయిల్ అయినా చెన్నై సూపర్ కింగ్స్ వారిని ఎక్కడా, ఏ విధంగానూ అవమానించలేదని, ఒక్క సీజన్‌లో పర్ఫామెన్స్ లేదని ఇలా చేస్తారా? ఓ ఆటగాడిని ఎలా గౌరవించాలో సీఎస్‌కేని చూసి నేర్చుకోవాలంటూ తిట్టిపోస్తున్నారు వార్నర్ భాయ్ ఫ్యాన్స్.
    Published by:Sridhar Reddy
    First published: