Home /News /sports /

Tokyo Olympics: డిస్కస్ త్రో ఫైనల్ రౌండ్‌కు కమల్‌ప్రీత్ కౌర్.. ఒలింపిక్స్ నుంచి అతాను దాస్, అమిత్ పంగల్ ఔట్

Tokyo Olympics: డిస్కస్ త్రో ఫైనల్ రౌండ్‌కు కమల్‌ప్రీత్ కౌర్.. ఒలింపిక్స్ నుంచి అతాను దాస్, అమిత్ పంగల్ ఔట్

డిస్కస్ త్రో ఫైనల్స్ చేరిన కమల్‌ప్రీత్ కౌర్ (PC: Reuters)

డిస్కస్ త్రో ఫైనల్స్ చేరిన కమల్‌ప్రీత్ కౌర్ (PC: Reuters)

డిస్కస్ త్రో ఫైనల్‌కు కమల్‌ప్రీత్ కౌర్ అర్హత సాధించింది. కానీ భారత పురుషులు నిరాశ మిగిల్చారు. ఆర్చరీ నుంచి అతాను దాస్, బాక్సింగ్ నుంచి అమిత్ పంగల్ నిష్క్రమించారు.

    టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) 2020లో మరో భారత మహిళా అథ్లెట్ (Woman Athlete) ముందంజ వేసింది. శనివారం ఉదయం నిర్వహించిన డిస్కస్ త్రో (Discuss Throw) క్వాలిఫికేషన్స్‌లో భారత అథ్లెట్ కమల్‌ప్రీత్ కౌర్ 64 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌లో తన బెర్త్ ఖాయం చేసుకున్నది. డిస్కస్ త్రో క్వాలిఫకేషన్ రౌండ్ గ్రూప్ బీలో పాల్గొన్న కమల్ ప్రీత్ (Kamalpreet Kaur) 64 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది. ఈ గ్రూప్‌లో మొత్తం 16 మంది అథ్లెట్లు ఫైనల్ రౌండ్ కోసం పోటీ పడగా.. అమెరికాకు చెందిన వలారీ అల్మాన్ 66.42 మీటర్ల దూరం విసిరి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కమల్ ప్రీత్ రెండో స్థానం పొందింది. గ్రూప్ బి నుంచి వీరిద్దరు మాత్రమే ఫైనల్‌ రౌండ్‌కు సెలెక్ట్ అయ్యారు. పంజాబ్‌కు చెందిన కమల్‌ప్రీత్ ఇటీవల ఇండియాలో నిర్వహించిన ఫెడరేషన్ కప్‌లో 65 మీటర్లు దూరం విసిరి రికార్డు సృష్టించింది. ఇండియాలో ఇంత వరకు ఏ మహిళా అథ్లెట్ అంత దూరం విసరలేదు. జాతీయ రికార్డు సృష్టించిన కమల్‌ప్రీత్ కౌర్ ఒలింపిక్స్ అర్హత రౌండ్‌లో అంత కంటే ఒక మీటర్ తక్కువే విసిరి ఫైనల్‌కు అర్హత సాధించింది.

    ఫైనల్ రౌండ్‌లో అంతకు మించిన దూరమే విసరాల్సి ఉంటుంది. తన జాతీయ రికార్డును కూడా బద్దలు కొట్టేంత దూరాన్ని అమెరికన్ అథ్లెట్ విసిరింది. కాబట్టి పతకం కోసం కమల్‌ప్రీత్ పెద్ద కసరత్తే చేయాలి. అగస్టు 2 సాయంత్రం 4.30 గంటలకు డిస్కస్ త్రో ఫైనల్స్ జరుగనున్నాయి.

    మరోవైపు టోక్యో ఒలింపిక్స్ పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో అతాను దాస్ నిరాశ పరిచాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో జపాన్ ఆర్చర్ పురుకవా చేతిలో 6-4 తేడాతో పరాజయం చెందాడు. ఇక పురుషుల 52 కిలోల రెండోరౌండ్ బాక్సింగ్ మ్యాచ్‌లో అమిత్ పంగల్ ఓడిపోయి వెనుదిరిగాడు.





    ఈ రోజు మధ్యాహ్నం పీవీ సిందు సెమీ ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీకి చెందిన తైజూతో తలపడనున్నది. ఆ మ్యాచ్‌లో సింధూ గెలిస్తే పతకం ఖాయం అయినట్లే.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Olympics, Tokyo Olympics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు